హెరాల్డ్ టాలీవుడ్ డిజాస్ట‌ర్లు 2024 : ఆనంద్ దేవరకొండకి కోలుకోలేని దెబ్బ.. ఇది ఊహించి ఉండడు..??

praveen
* బేబీ సినిమాతో 100 కోట్లు సంపాదించిన ఆనంద్
* కానీ నెక్స్ట్ మూవీ డిజాస్టర్  
* ఆనంద్ కి ఇది పెద్ద దెబ్బ
( ఏపీ - ఇండియా హెరాల్డ్)
అల్లు అర్జున్ తమ్ముడు ఆనంద్‌ దేవరకొండకు 2024 అస్సలు కలిసి రాలేదనే చెప్పాలి. మిడిల్ క్లాస్ మెలోడీస్ బేబీ లాంటి విభిన్నమైన సినిమాలతో ఈ హీరో పెద్ద హిట్స్ అందుకున్నాడు కానీ ఈ సంవత్సరం అతనికి ఎందుకో ఒక్క హిట్ కూడా లభించలేదు. నిజానికి ఈ 'అర్జున్ రెడ్డి' తమ్ముడు ఈ సంవత్సరం చేసింది ఒకటే మూవీ. అదే గం గం గణేశా. క్రైమ్ కామెడీ ఫిలిం గా వచ్చిన ఇందులో ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక, ఇమ్మాన్యుయేల్, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్ వంటి స్టార్ యాక్టర్లు నటించారు. అయినా ఈ మూవీని వారు కాపాలేకపోయారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈ సినిమాలో బలమైన స్టోరీ లేదు. సినిమా ఆద్యంతం చాలా బోర్ కొట్టించేసింది.
బేబీ లాంటి మంచి హిట్ కొట్టాక ఆనంద్ సినిమాలపై హైప్స్ అనేవి ఆటోమేటిక్‌గా పెరిగిపోయాయి. ఇక సమ్మర్ స్పెషల్ గా తీసుకువచ్చిన గం గం గణేశా ఇంకా బాగా అలరిస్తుందని అనుకున్నారు కానీ ఇది బాక్సాఫీస్ వద్ద పడకేసింది. ఇది మొత్తం థియేట్రికల్ రన్‌లో కేవలం 6 కోట్లు కలెక్ట్ చేయడానికే నానా తంటాలు పడింది. చివరికి ఈ సంవత్సరం ఇది బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. కనీసం ఈ మూవీలోని పాటలు కూడా ఆకట్టుకోలేకపోయాయి. ఆనంద్ దీన్ని ఊహించి ఉండడు. దీన్నెలా ఒప్పుకున్నాడా అని చాలామంది ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తం చేశారు. ఉదయ్ బొమ్మిశెట్టి అనే కొత్త డైరెక్టర్ మూవీ తీశాడు. ఇది ఫెయిల్ కావడం వల్ల ఆనంద్‌ దేవరకొండ సైలెంట్ అయిపోయాడు. ఇప్పటివరకు అతన్నించి పెద్దగా అప్డేట్స్ ఏమీ రాలేదు.
ఈ యంగ్ హీరో డ్యూయెట్ అనే సినిమా చేస్తున్నట్లు సమాచారం. కానీ ఆ సినిమా పెద్దగా బజ్ క్రియేట్ చేయడం లేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అన్నకంటే త్వరగానే హండ్రెడ్ క్రోర్ క్లబ్ లో చేరిన ఆనంద్‌ స్క్రిప్ట్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో అలసత్వం వ్యవహరిస్తే అతని కెరీర్ కి ఫుల్ స్టాప్ పడే ప్రమాదం ఉంది. ఈ కుర్ర హీరో నుంచి మరిన్ని కొత్త కథలను ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. మంచి కథ వస్తే కచ్చితంగా బేబీ లాంటి హిట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మరి 2025లో అతను ప్రేక్షకులను మెప్పిస్తాడో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: