సినీ ఇండస్ట్రీలో విషాదం.. బలగం మూవీ మొగిలయ్య ఇక లేరు..!
బలగం చిత్రంలో క్లైమాక్స్‌లో చాలా భావోద్వేగభరితమైన పాటలను పాడి అందరి హృదయాలను ఆకట్టుకున్న మొగిలయ్య ఈ సినిమాతో రాష్ట్రవ్యాప్తంగా భారీగానే పాపులారిటీ అందుకున్నారు. గత కొద్దిరోజులుగా కిడ్నీ సమస్యలతో పాటు గుండె సమస్యతో ఇబ్బంది పడుతున్నారట. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇప్పటికే ఆయనకు చికిత్స కూడా చేయించాలని వైద్యులను సూచించారు. అయినప్పటికీ కూడా ఈయన గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఇటీవలే తీవ్ర అస్వస్థకు గురికావడంతో వెంటనే హుటాహుటిగా కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారట.
కానీ ఈ సమయంలోనే ఆయన ఆరోగ్యం విసమించి మరణించినట్లుగా సమాచారం. దీంతో మొగిలయ్య మరణం పట్ల పలువురు సినీ సెలబ్రిటీలతో పాటు బలగం సినిమా డైరెక్టర్ చిత్ర బృందం సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా నిన్నటి రోజున తెలంగాణలోని ఒక పాప్ సింగర్ కూడా వేధింపులు తాళలేక పెళ్లి అయిన పది రోజులకి మరణించినట్లుగా తెలుస్తోంది. మరి ఇప్పుడు బలగం మొగిలయ్య కూడా మరణించడంతో ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. మరి మొగిలయ్య భార్యకు అటు ప్రభుత్వం నుంచి గాని ఇటు సిని ఇండస్ట్రీ నుంచి ఏదైనా సహాయం అందుతుందేమో చూడాలి మరి.