తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులలో విక్టరీ వెంకటేష్ ఒకరు. విక్టరీ వెంకటేష్ తన కెరియర్లో ఎన్నో విజయవంతమైన సినిమాలలో నటించి అద్భుతమైన క్రేజ్ ఉన్న నటుడిగా ప్రస్తుతానికి కూడా కెరీర్ను ముందుకు సాగిస్తున్నాడు. ఇకపోతే విక్టరీ వెంకటేష్ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా సైన్ధవ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్గా నటించింది.
ఇకపోతే ఈ సినిమా కంటే ముందు వెంకటేష్ నటించిన సినిమాలు కొన్ని ప్రేక్షకుల ముందుకు వచ్చినా కూడా అవి థియేటర్లలో కాకుండా నేరుగా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో విడుదల అయ్యాయి. ఇక ఈ సినిమా కంటే ముందు వెంకటేష్ నటించిన ఎఫ్ 3 సినిమా థియేటర్లలో విడుదల అయిన ఈ మూవీ లో వెంకటేష్ తో పాటు వరుణ్ తేజ్ కూడా హీరోగా నటించాడు. ఈయన సోలో హీరోగా నటించి థియేటర్లలో సైంధవ్ సినిమా కంటే ముందు విడుదల అయిన సినిమా వెంకీ మామ. ఈ సినిమా 2019 వ సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదల అయింది. వెంకీ మామ మూవీ తర్వాత వెంకటేష్ సోలో హీరోగా నటించిన సైందవ్ సినిమానే థియేటర్లలో విడుదల అయింది. దానితో వెంకీ మామ సినిమాకు సైంధవ్ మధ్య చాలా గ్యాప్ ఉండడంతో ఈయన అభిమానులు కచ్చితంగా వెంకటేష్ ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంటాడు అనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
కానీ భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. దానితో ఈ సినిమా ద్వారా వెంకటేష్ కు పెద్ద స్థాయి విజయం దక్కలేదు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వెంకటేష్ , అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మరి ఈ సినిమాతో వెంకటేష్ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.