ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. రాజా సాబ్ విడుదల వాయిదా?
ఇక ఇప్పుడు మారుతి దర్శకత్వంలో తరకేక్కుతున్న రాజా సాబ్ అనే మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే ఈ మూవీలో మరోసారి వింటేజ్ ప్రభాస్ ని చూడబోతున్నాము అని అభిమానులు అందరూ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ఈ మూవీ గురించి ఇప్పటికే విడుదలైన ప్రభాస్ ఫస్ట్ లుక్ సినిమాపై ఉన్న అంచనాలను మరింతగా పెంచేసింది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాను 2025 ఏప్రిల్ 10వ తేదీన విడుదల చేయాలని ఇప్పటికే చిత్రబృందం ఒక అఫీషియల్ డేట్ ని కూడా ప్రకటించేసింది.
దీంతో ఏప్రిల్ 10వ తేదీ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు అందరూ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. కానీ ది రాజా సాబ్ విడుదల విషయంలో మాత్రం అభిమానులకి నిరాశే ఎదురయ్యే అవకాశం ఉంది అన్నది తెలుస్తోంది. ఎందుకంటే రాజా సాబ్ విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. షూటింగ్ తో పాటు వీఎఫ్ ఎక్స్ పోస్టు ప్రొడక్షన్ అనుకున్న సమయానికి పూర్తి కావని.. అందుకే ఈ చిత్రం 2025 ఏప్రిల్ 10వ తేదీన విడుదల చేయడం కష్టమేనని చెబుతున్నాయి. దీంతో సిద్దు జొన్నలగడ్డ నటిస్తున్న జాక్ మూవీ ఈ తేదీని బుక్ చేసుకున్నట్లు సమాచారం. మరి దీనిపై అటు మూవీ టీం స్పందించాల్సి ఉంది.