దీపికాకి షాక్ ఇచ్చిన రష్మిక.. ఏకంగా ఆ క్రేజీ సీక్వెల్ నుండి అవుట్..?

Pulgam Srinivas
మోస్ట్ టాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్ నటీమణి రష్మిక మందన గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ కన్నడ సినిమా అయినటువంటి కిరిక్ పార్టీ మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకొని కన్నడ సినీ పరిశ్రమలో సూపర్ సాలిడ్ గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత ఈ బ్యూటీ తెలుగు సినీ పరిశ్రమ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా ఛలో అనే మూవీ తో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించి ఈ నటి మొదటి మూవీతోనే మంచి విజయాన్ని అందుకుంది.

ఆ తర్వాత కూడా ఈమె నటించిన సినిమాలలో చాలా సినిమాలు మంచి విజయాలను సాధించడంతో తెలుగులో ఈమె స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్ళింది. ఇకపోతే ఈ బ్యూటీ కొంత కాలం క్రితం పుష్ప పార్ట్ 1 అనే పాన్ ఇండియా మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈమెకు ఇండియా వ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. దానితో ఈమెకు హిందీ సినిమాలలో వరస పెట్టి అవకాశాలు దక్కుతున్నాయి. ఇకపోతే ఇప్పటికే ఈ బ్యూటీ పలు హిందీ సినిమాలలో నటించింది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సికిందర్ మూవీలో హీరోయిన్గా నటిస్తుంది. ఇకపోతే మరో హిందీ మూవీలో ఈ బ్యూటీ కి ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తుంది.

2012 వ సంవత్సరం సైఫ్ అలీ ఖాన్ హీరోగా దీపికా పదుకొనే హీరోయిన్గా కాక్ టెయిల్ అనే సినిమా వచ్చే బ్లాక్ బాస్టర్ విజయం అందుకున్న అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాకు కొనసాగింపుగా కాక్  టెయిల్ 2 అనే మూవీని మేకర్స్ నిర్మించడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా సైఫ్ అలీ ఖాన్ పాత్రకు షాహిద్ కపూర్ ని , దీపికా పదుకొనే పాత్రకు రష్మిక మందను మేకర్స్ ఓకే చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: