సలార్ అడుగుజాడలలో ఓజీ !

Seetha Sailaja
పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే తాను ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసి ఆసినిమా నిర్మాతలకు నష్టాలు కలగకుండా చూడాలని తన శక్తి వంచన లేకుండా తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఆ ప్రయత్నాలలో భాగంగా ‘హరిహర వీరమల్లు మూవీకి సంబంధించిన పెండింగ్ వర్క్ ను పవన్ మధ్యమధ్యలో పూర్తి చేస్తూ ఆమూవీని వచ్చే సంవత్సరం మార్చిలో విడుదల చేయాలని నిర్మాతలు చేస్తున్న ప్రయత్నాలకు తన వంతు సహకారం పవన్ అందిస్తున్న విషయం తెలిసిందే.

ఈసినిమా ముందుగా విడుదల అవుతున్నప్పటికీ పవన్ నటిస్తున్న ‘ఓజీ’ మూవీ పైనే భారీ అంచనాలు అభిమానులలో ఉన్నాయి. ఈమూవీకి సంబంధించిన చిన్న టీజర్ చాలకాలం క్రితం విడుదల అయినప్పుడు సోషల్ మీడియాను షేక్ చేసిన విషయం తెలిసిందే. గ్యాంగ్ ష్టర్ మూవీగా షూటింగ్ దశలో ఉన్న ఈమూవీకి సంబంధించిన లేటెస్ట్ షెడ్యూల్ ఈమధ్య థాయిలాండ్ లో జరిగింది.

ఈమూవీలో నేహా శెట్టి ఒక స్పెషల్ సాంగ్ ఈమధ్యనే చేసిందని వార్తలు వస్తున్నాయి. తమన్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ ట్రెండింగ్ గా మారుతుందని అంచనాలు వస్తున్నాయి. అయితే ఈమధ్యనే ఘాట్ చేసిన ఈపాట షూటింగ్ లో పవన్ కళ్యాణ్ తప్ప ఈమూవీలో నటిస్తున్న కీలక నటీనటులు అందరూ ఈపాట చిత్రీకరణలో పాలుగున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రభాస్ నటించిన ‘సలార్’ మూవీలో ఒక ఐటమ్ సాంగ్ ఉన్నప్పటికీ ఆ సాంగ్ లో ప్రభాస్ కనిపించడు ఇప్పుడు అదే ట్రెండ్ ను ‘ఓజీ’ విషయంలో కూడ దర్శకుడు సుజిత్ అనుసరిస్తున్నట్లు టాక్. ‘సలార్’ మూవీ నిడివి సుమారు 2-50 నిముషాలు ఉన్నప్పటికీ ప్రభాస్ ఆమూవీలో కనిపించేది కేవలం ఒక గంట ఇరవై నిముషాలు మాత్రమే. అయితే ఆమూవీ దర్శకుడు అనుసరించిన స్క్రీన్ ప్లే టెక్నిక్ తో ప్రభాస్ అన్ని సీన్స్ లోను కనిపించినట్లు అనిపిస్తుంది. ఇప్పుడు అదే టెక్నిక్ ను దర్శకుడు సుజిత్ ‘ఓజీ’ విషయంలో అనుసరిస్తున్నాడు అంటూ మాటలు వినిపిస్తున్నాయి..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: