తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం సూపర్ సాలిడ్ జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తున్న యువ నటీమణులలో శ్రీ లీల ఒకరు. ఈ ముద్దుగుమ్మ శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా రూపొందిన పెళ్లి సందD అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మొదటి మూవీ తోనే తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ప్రస్తుతం ఈమె వరస పెట్టి సినిమాలలో నటిస్తూ పోయిన సంవత్సరం చాలా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బ్యూటీ ఈ సంవత్సరం మాత్రం ఆ స్థాయిలో సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాలేదు.
ఈ సంవత్సరం ప్రారంభంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన గుంటూరు కారం సినిమాతో ఈ ముద్దుగుమ్మ ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా యావరేజ్ విజయాన్ని అందుకుంది. కొంత కాలం క్రితం అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప పార్ట్ 2 మూవీలో ఈ బ్యూటీ స్పెషల్ సాంగ్లో నటించింది. ఈ సాంగ్ ద్వారా ఈమెకు మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమాను మైత్రి సంస్థ వారు నిర్వహించారు. మైత్రి సంస్థ వారు నితిన్ హీరోగా వెంకి కుడుమల దర్శకత్వంలో రాబిన్ హుడ్ అనే సినిమాను రూపొందించారు. ఈ మూవీలో శ్రీ లీల హీరోయిన్గా నటించింది. ఈ సినిమాను ఈ సంవత్సరం డిసెంబర్ 25వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ మొదట ప్రకటించారు.
కానీ ఈ సినిమాను డిసెంబర్ 25 వ తేదీన విడుదల చేయడం లేదు అని , కొత్త విడుదల తేదీని మరికొన్ని రోజుల్లో ప్రకటిస్తామని ప్రకటించారు. ఇలా మైత్రి సంస్థ వారు రాబిన్ హుడ్ సినిమాను కనుక ఈ సంవత్సరం విడుదల చేసి ఉంటే శ్రీ లీలా నటించిన మూడో సినిమా ఈ సంవత్సరం విడుదల అయ్యేది. కానీ మైత్రి సంస్థ వారు రాబిన్ హుడ్ సినిమాను పోస్ట్ పోన్ చేయడంతో ఈ ముద్దుగుమ్మ ఈ సంవత్సరం రెండు సినిమాలతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది.