షాకింగ్.. చంద్రబాబు బయోపిక్‌లో ఆ స్టార్ హీరో
చంద్రబాబు జీవిత కథకు ప్రేరణగా 'ది లెజెండ్ ఆఫ్ చంద్రబాబు' అనే నవలను ఆధారంగా తీసుకుని ఈ చిత్రం రూపొందించనున్నారు. ఈ బయోపిక్‌ను రూపొందించేందుకు నిర్మాతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాను నిర్మించేందుకు రచయిత, దర్శకుడు కె. రాజేశ్వర్ రాసిన జేపీ. ది లెజెండ్ ఆఫ్ చంద్రబాబు నవలను సినిమాగా రూపొందించడానికి హక్కులను, నటుడు చంద్రబాబు సోదరుడు జవహర్ నుంచి అనుమతి తీసుకున్నట్లు ఈ సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఈ బయోపిక్ కి యువ గీత రచయిత మదన్ కార్గీ కూడా స్క్రీన్ ప్లే, మాటలు రారాస్తున్నారని చెప్పారు. అలాగే ఈ నవలను చిత్రంగా మలచడానికి కథకుడు, మాటల రచయిత జయమోహన్ సిద్ధమయ్యారని స్పస్టం చేశారు.
అయితే ఇందులో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ముఖ్య పాత్రలో నటించనున్నట్లు సమాచారం వస్తుంది. ఇందులో నటించే ఇతర నటీనటుల వివరాలను ఇంకా వెల్లడించలేదు. ఈ సినిమా ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఇప్పటికే హీరో ధనుష్ ఇళయరాజా బయోపిక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక భారతీయ సినీ రంగంలో ఒక ప్రత్యేక గాయకుడిగా, హాస్యనటుడిగా, విభిన్న పాత్రల్లో తన ప్రతిభను చాటుకున్న చంద్రబాబు పాత్రలో ధనుష్ కనిపిస్తే ప్రేక్షకులకు ఆసక్తికర అనుభవం కలిగే అవకాశం ఉందని టాక్ నడుస్తుంది.