అభిమానులకి బిగ్ షాక్ ఇచ్చిన కీర్తి సురేష్..ఇవేం పనికి మాలిన పనులు బేబీ..!?

Thota Jaya Madhuri
సాధారణంగా ఎవ్వరైనా సరే పెళ్లి తర్వాత ఏం చేయాలనుకుంటారు.. హనీమూన్ కి వెళ్ళాలి అనుకుంటారు..?  తమ భర్తతో లేదా భార్యతో బాగా ఎంజాయ్ చేయాలి అని మనసు విప్పి మాట్లాడాలి అని అనుకుంటూ ఉంటారు. చాలా సర్వసాధారణమైన విషయమే ఇది . చాలా మంది లైఫ్లో కూడా ఇది జరుగుతూ ఉంటుంది . అయితే కీర్తి సురేష్ మాత్రం అభిమానులకు బిగ్ షాక్ ఇచ్చింది. ప్రాణం కంటే ఎక్కువుగా  15 సంవత్సరాల ప్రేమించిన వ్యక్తిని తాజాగా పెళ్లి చేసుకున్న కీర్తి సురేష్.. మూడు ముళ్ళు పడగానే అతనిని ఏమాత్రం పట్టించుకోకుండా.. సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనింది.

 
ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. ఎస్ కీర్తి సురేష్ చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీ తట్టిల్ ను పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. మొదట గోవాలో వీళ్ల పెళ్లి చాలా గ్రాండ్గా జరిగింది. ఆ తర్వాత క్రిస్టియన్ పద్ధతిలోనూ వీళ్ళ పెళ్లి జరుపుకున్నారు . ఆంటోనీ తట్టిల్  క్రిస్టియన్ అన్న విషయం అందరికీ తెలిసిందే. రెండు సాంప్రదాయాలను గౌరవిస్తూ చాలా ఆహ్లాదకరంగా వీళ్ళు పెళ్లి చేసుకున్నారు . అయితే పెళ్లి తర్వాత కీర్తి సురేష్ ఏ మాల్దీవ్స్ కో.. ఏ వేరే కంట్రీ కి వెళ్ళిపోతుంది అని అంతా అనుకున్నారు .


హనీమూన్ ను బాగా ఎంజాయ్ చేస్తుంది అంటూ ఆశపడ్డారు. కానీ అది ఏమీ జరగలేదు . కీర్తి సురేష్ తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మెరిసింది . అది కూడా మెడలో పసుపు తాళితో.  దీంతో  ఒక్కసారిగా జనాలు షాక్ అయిపోయారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో కీర్తి సురేష్ "బేబీ జాన్" మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే .  బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిస్తున్న "బేబీ జాన్" సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనింది. కీర్తి సురేష్ సంబంధించిన పిక్స్ బాగా వైరల్  అవుతున్నాయి . మెడలో పసుపు తాళితో రెడ్ కలర్ డ్రెస్ లో చాలా హాట్ గా కనిపించింది . దీంతో సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన పిక్స్ బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారాయి . కీర్తి సురేష్ ఇలా చేస్తుంది అని ఊహించలేకపోయారు జనాలు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: