ప్రభాస్ రాజాసాబ్ పై గుడ్ న్యూస్.. షూటింగ్ ఎంత కంప్లీట్ అయింది అంటే?

praveen
డార్లింగ్ ప్ర‌భాస్ – మారుతి కాంబో నుండి వస్తోన్న సినిమా రాజాసాబ్‌ మీద ప్ర‌భాస్ అభిమానులు ఎంత‌గానో ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటి వరకు ప్ర‌భాస్ అంతా ‘రా’, ‘యాక్ష‌న్‌’ లుక్‌లో క‌నిపిస్తున్నాడు. ప్ర‌భాస్‌ని వింటేజ్ లుక్‌లో చూసి అభిమానులకు చాలా సంవత్సరాలు అవుతోంది. దాంతోనే రాజాసాబ్ సినిమా కోసం జనాలు ఎంతగానో ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఇక సినిమా టీజర్ క్రిస్మ‌స్‌కి గానీ, జ‌న‌వ‌రి 1కి గానీ చిత్ర‌బృందం విడుద‌ల చేద్దామని ప్లాన్ చేసింది. టీజ‌ర్ క‌ట్ కూడా అయిపోయిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ఈ టీజర్ విడుదల వాయిదా ప‌డింది. దానికి కార‌ణం… రాజాసాబ్ విడుద‌ల‌లో స్ప‌ష్ట‌త లేక‌పోవ‌డ‌మే.
అవును, బేసిగ్గా ‘రాజాసాబ్‌’ సినిమాని ఏప్రిల్ 10న విడుద‌ల చేద్దామ‌నుకొన్నారు చిత్ర యూనిట్. అయితే ఇప్పుడు అనుకొన్న స‌మ‌యానికి రాజాసాబ్ రావ‌డం క‌ష్టం అని అనిపిస్తోంది. అసలు విషయంలోకి వెళితే... రాజాసాబ్ సినిమా ఈపాటికే దాదాపు 80 శాతం పూర్తయినట్టు సామాచారం. ఇంకా 20 శాతం సినిమా మాత్రమే మిగిలి వుంది. అయితే ఈ సినిమాకిగాను చేయవలసిన VFX పార్ట్ ఇంకా మిగిలే ఉంది. దాంతోనే ఈ సినిమా అనుకున్న సమయానికి కాకుండా మే నాటికి రావొచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం.
దాంతోనే టీజ‌ర్‌ని కూడా ఇప్పుడు విడుద‌ల చేయ‌డం లేదని సమాచారం. ఈ క్రమంలోనే చిత్ర‌బృందం ఓ స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఇప్ప‌ట్లో రాజాసాబ్ టీజ‌ర్‌ని వ‌దిలేది లేద‌ని కూడా స్ప‌ష్టం చేసింది. అవును, జ‌న‌వ‌రి 14న ఓ ఫస్ట్ సింగల్ అయితే రావొచ్చు. ఇంకా ఈ సినిమాకి గాను 4 పాట‌లు అయితే తెర‌కెక్కించాల్సివుంది. జ‌న‌వ‌రిలో 2 పాట‌ల్ని, ఫిబ్ర‌వ‌రిలో 2 పాట‌ల్ని తెర‌కెక్కించాల‌ని చిత్రబృందం ప్లాన్‌ చేస్తున్నట్టు గుసగుసలు వినబడుతున్నాయి. జ‌న‌వ‌రి పాట‌ల కోసం హైద‌రాబాద్ లోనే సెట్లు త‌యారు అవుతుండగా... ఫిబ్ర‌వ‌రి లో ఫారెన్ ట్రిప్ ఎలాగూ ఉంది. అక్క‌డ 2 పాట‌ల్ని పూర్తి చేయాల్సి ఉంది. ఇకపోతే త‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారనే సంగతి విదితమే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: