డాకు మ‌హారాజ్‌కు ఆ ప్రమాదం తప్పింది..ఇక చరిత్ర తిరగరాయడమే ?

Veldandi Saikiran
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం "డాకు మహారాజ్".ఈ సినిమాలో బాలకృష్ణ హీరోగా, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగ వంశీ ఈ సినిమాను సాయి సౌజన్యతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ లుక్ సినిమా ప్రేక్షకులలో భారీ అంచనాలను పెంచుతుంది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఇప్పటివరకు బాలకృష్ణ కెరీర్ లో డాకు మహా రాజ్ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమా రన్ టైమ్ ను లాక్ చేసినట్టుగా సమాచారం అందుతుంది. చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా నిడివి 2 గంటల 45 నిమిషాల పాటు ఉంటుందని సమాచారం. ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల సినిమాలు మూడు గంటలు, అంతకుమించి ఉండడం జరుగుతుంది.

కానీ ఈ సినిమా విషయంలో అలాంటి రిస్క్ తీసుకోవాలని చిత్ర యూనిట్ అనుకోవడం లేదట. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిన అక్కడక్కడ ల్యాగ్స్ ఉన్నాయి అంటూ కొన్ని సినిమాలకు ఈ మధ్యకాలంలో విమర్శలు వస్తూనే ఉన్నాయి. అలాంటి విమర్శలు ఈ సినిమాకు రాకూడదు అనే ఉద్దేశంతో 2 గంటల 45 నిమిషాల పాటు మాత్రమే ఈ సినిమా నిడివిని ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది.

డాకు మహారాజ్ సినిమా కోసం బాలయ్య బాబు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమా అనంతరం బాలకృష్ణ దర్శకుడు బోయపాటి శ్రీనుతో కలిసి అఖండ-2 సినిమాను చేయబోతున్నారు. అఖండకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో అఖండ-2 ప్రారంభమైంది. కాగా అఖండ-2 సినిమా పూజా కార్యక్రమానికి బాలకృష్ణ కూతురు తేజస్విని ప్రజెంటర్ గా వ్యవహరిస్తున్నారు. అఖండ-2 సినిమాకు సంబంధించి మరికొన్ని వివరాలు వెలవడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: