అల్లు అర్జున్ కొన్ని సంవత్సరాల క్రితం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన అలా వైకుంఠపురంలో అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. పూజా హెగ్డే , నివేత పెత్ రాజ్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించారు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసి సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ "పుష్ప పార్ట్ 1" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రష్మిక మందర హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించాడు.
ఈ మూవీ మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంది. ఇలా ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ మూవీ కి కొనసాగింపుగా పుష్ప పార్ట్ 2 అనే సినిమాను రూపొందించారు. ఈ సినిమాను డిసెంబర్ 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు. ఈ మూవీ కి అద్భుతమైన టాక్ రావడంతో ఇప్పటికే ఈ మూవీ 1300 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ మూవీ విడుదల అయిన 13 వ రోజు మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో అలా వైకుంఠపురంలో సినిమా వసూలు చేసిన స్థాయిలో కలెక్షన్లను వసూలు చేయలేదు.
విడుదల అయిన 13 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో అలా వైకుంఠపురంలో సినిమా 2.77 కోట్ల షేర్ కలక్షన్లను వసూలు చేస్తే పుష్ప పార్ట్ 2 మూవీ మాత్రం 1.76 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసింది. అలా విడుదల అయిన 13 వ రోజు అలా వైకుంఠపురం లో సినిమాతో పోలిస్తే పుష్ప పార్ట్ 2 మూవీ చాలా వరకు వెనుకబడిపోయింది.