ఉత్తమ నటుడు.. అంత ఈజీ కాదు సుమా..!
పుష్ప 1 తో అల్లు అర్జున్ కి మొదటిసారి తెలుగు హీరోకి నేషనల్ అవార్డ్ వచింది. పుష్ప 1 లో తన నటనకు అవార్డ్ వస్తుందని ఎవరు ఊహించలేదు. ఐతే ఈ ఇయర్ పుష్ప 2 వచ్చింది. ఆ సినిమా చూశాక మళ్లీ అవార్డ్ పక్కా అనిపించేలా చేశాడు. ఐతే ఈ ఇయర్ పుష్ప 2 మాత్రమే కాదు ఆ అవార్డ్ కు పోటీ పడేలా మరికొన్ని సినిమాలు.. కొన్ని పర్ఫార్మెన్స్ లు ఉన్నాయి.
పుష్ప 2 లో అల్లు అర్జున్ పూనకాలు తెప్పించే పర్ఫార్మెన్స్ తో పాటుగా మలయాళంలో పృధ్విరాజ్ ది గోట్ లైఫ్ ఆడు జీవితం సినిమాలో కూడా అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఆ సినిమా కోసం పృధ్విరాజ్ పడిన కష్టం అంతా ఇంతా కాదు. మరోపక్క తమిళ్ నుంచి చియాన్ విక్రం తంగలాన్ కోసం మరోసారి తన వర్సటాలిటీ చూపించేలా నటించాడు. ఈ సినిమా కూడా కమర్షియల్ గా వర్క్ అవుట్ అయ్యింది. ఐతే పుష్ప 2లో అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా అవార్డ్ తీసుకు రావాలంటే వీరిద్దరిని దాటి రావాల్సి ఉంటుంది. మరి ఈ ఇయర్ నేషనల్ అవార్డ్ ఎవరికి వస్తుంది అన్నది చూడాలి. ఐతే మళ్లీ అల్లు అర్జున్ కే వస్తుంది అని అల్లు ఫ్యాన్స్ చాలా గట్టిగా చెబుతున్నా కూడా మిగతా వారి నుంచి గట్టి పోటీ వచ్చేలా ఉందని మాత్రం చెప్పొచ్చు.ల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా అవార్డ్ తీసుకు రావాలంటే వీరిద్దరిని దాటి రావాల్సి ఉంటుంది. మరి ఈ ఇయర్ నేషనల్ అవార్డ్ ఎవరికి వస్తుంది అన్నది చూడాలి.