కీర్తి సురేష్ కష్టాన్ని గుర్తించరేంటి..?
కీర్తి సురేష్ బేబీ జాన్ ఈవెంట్ కు తాళితో వచ్చింది. మరి వచ్చింది ఏమైనా శారీ కట్టుకుని మెడలో తాళితో వచ్చిందా కాదు మోడ్రన్ డ్రస్ లో అందాలను గుమ్మరిస్తూ మెడలో తాళి వేసుకుంది. అదే అసలు మ్యాచ్ అవ్వక జనాలు ఇబ్బంది పడ్డారు. తనకు అది ఇంపార్టెంట్ కాబట్టే వేరే హీరోయిన్స్ లా తీసి రాకుండా మెడలో ఉంచుకుని వచ్చింది.
కానీ ఆమె వేసుకున్న డ్రస్ వల్ల ఆ తాళి ఎక్కువ ఎక్స్ పోజ్ అయ్యింది. దీని వల్ల కీర్తి ఆడియన్స్ కి ఒక ట్రోల్ మెటీరియల్ అయ్యింది. ఇన్నాళ్లు తన క్యూట్ నెస్ తో అలరిస్తూ వచ్చిన కీర్తి సురేష్ బాలీవుడ్ నీళ్లు పడ్డాయో లేదో బీభత్సమైన గ్లామర్ షో చేస్తుంది. అసలు కీర్తి సురేష్ కి బాలీవుడ్ కి వెళ్లాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందో కానీ ఇప్పటివరకు ఆమెకున్న ఇమేజ్ ని డ్యామేజ్ చేసేలా రెస్పాన్స్ వస్తుంది. బేబీ జాన్ ప్రమోషన్స్ లోనే కాదు సినిమాలో కూడా కీర్తి సురేష్ రెచ్చిపోయిందని తెలుస్తుంది. బేబీ జాన్ కి హిట్ టాక్ వస్తే మాత్రం కీర్తికి హిందీలో మరిన్ని ఆఫర్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఐతే అక్కడ చేసే ప్రతి సినిమాలో అమ్మడు ఇదే రేంజ్ షో చేస్తుందని చెప్పడం కష్టం. n