టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. కెరీర్ ప్రారంభంలో రచయితగా పని చేసిన కొరటాల ఎన్నో సూపర్ హిట్ కథలను అందించారు.. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘మిర్చి’ సినిమాతో కొరటాల డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు.. కొరటాల తెరకెక్కించిన బిగ్గెస్ట్ మాస్ అండ్ యాక్షన్ మూవీ మిర్చి.. ఈ సినిమాలో ప్రభాస్ స్టైల్ కి, యాక్షన్ కి ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.. ప్రభాస్ కెరీర్ లో మిర్చి సినిమా మాసీవ్ హిట్ గా నిలిచింది..మిర్చి సినిమాతో దర్శకుడిగా కొరటాల బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.. ఆ తరువాత కొరటాల మహేష్ బాబుతో శ్రీమంతుడు, ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ తెరకెక్కించాడు.. ఆ తరువాత మహేష్ తోనే మరో సారి “ భరత్ అనే నేను “ అనే బిగ్గెస్ట్ పొలిటికల్ మూవీ తెరకెక్కించి కొరటాల మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.. ఇలా వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న కొరటాలకు మెగాస్టార్ చిరంజీవి బిగ్ ఆఫర్ ఇచ్చారు..
రాంచరణ్, మెగాస్టార్ చిరంజీవి ఇద్దరిని కలిపి ఓ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ ను కొరటాల ప్లాన్ చేసాడు.. ఆ సినిమానే “ఆచార్య “..కానీ ఏమంటూ ఈ సినిమా ఒప్పుకున్నాడో కానీ కొరటాల తన కెరీర్ లో చేసిన బిగ్ మిస్టేక్ అని చెప్పొచ్చు..
చిరంజీవి, రాంచరణ్ మల్టీస్టారర్ అంటే ఓ రేంజ్ అంచనాలు ఉంటాయి.. ఆ అంచనాలు “ ఆచార్య “ తీర్చలేకపోయింది.. ఆ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది.. దీనితో కొరటాల ఒక్కసారిగా డౌన్ ఫాల్ అయ్యారు.. కానీ ఎక్కడ నిరుత్సాహపడకుండా తనని తాను నిరూపించుకునేందుకు ప్రయత్నించాడు..ఎన్టీఆర్ తో మరో సినిమా చేసేందుకు ఒప్పించాడు.. ఆర్ఆర్ఆర్ తో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ఎన్టీఆర్ తో కొరటాల “దేవర “ అనే బిగ్గెస్ట్ మాస్ యాక్షన్ సినిమా మొదలు పెట్టాడు.. ఆ సినిమా కోసం కొరటాల ఎంతో కష్టపడ్డాడు.. అయితే కథ చాలా పెద్దది కావడంతో సినిమాను రెండు పార్ట్స్ గా తెరకెక్కించాడు..మొదటి పార్ట్ ఈ ఏడాది సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయింది..
ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది.. అలాగే బాలీవుడ్ స్టార్ “సైఫ్ అలీఖాన్ “ ఈ సినిమాలో విలన్ గా నటించాడు.. అయితే దేవర రిలీజ్ అయిన మొదటి షో కే ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ వచ్చింది.. కానీ ఎన్టీఆర్ క్రేజ్ కారణంగా ఈ సినిమా దాదాపు 550 కోట్ల కలెక్షన్స్ సాధించింది..దేవర పార్ట్ 1 కి మిక్స్డ్ టాక్ రావడంతో పార్ట్ 2 ఉంటుందో లేదో తెలియని పరిస్థితి.. ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా వున్నాడు.. ఈ సినిమాలు పూర్తి అయ్యాకే దేవర పార్ట్ 2 పై ఓ నిర్ణయానికి వస్తారు.. ఈ లోపు కొరటాల మరో స్టార్ హీరో విజయ్ దేవరకొండ తో ఓ బిగ్గెస్ట్ మూవీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం..