హెరాల్డ్‌ ఫ్యాష్‌ బ్యాక్‌ 2024: పుష్ప 2తో ఇండస్ట్రీని దున్నేసిన సుకుమార్‌..1500 కోట్లు క్రాస్‌?

Veldandi Saikiran
టాలీవుడ్ ఇండస్ట్రీలో... చాలామంది దర్శకులు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో కొంతమంది సక్సెస్ అవుతుంటే మరి కొంత మంది అట్టర్ ఫ్లాప్ అవుతూ ఉంటారు. మరి కొంతమంది ఒక సినిమా హిట్ కాగానే... వరుస పెట్టి హిట్లు కొడుతూ ఉంటారు. అలాంటివారు మన టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు ఉన్నారు. ఈ లిస్టులో మొదటి వరుసలో సుకుమారు ఉంటారు. దర్శకుడు సుకుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

సుకుమార్ సినిమా తీశాడు అంటే దాని వెనుక ప్రత్యేక కథ ఉంటుంది. దానికి ఉదాహరణ రంగస్థలం లాంటి బడా సినిమా. అయితే సుకుమార్ ఈ 2024 సంవత్సరంలో బంపర్ హిట్ అందుకున్నాడు. అల్లు అర్జున్ హీరోగా చేసిన  పుష్ప 2 సినిమాను 2024 సంవత్సరం డిసెంబర్ నాలుగున రిలీజ్ చేసింది  సుకుమార్ చిత్ర బృందం. అంటే దాదాపు 15 రోజుల కిందట ఈ సినిమా రిలీజ్ అయింది.

450 కోట్లకు పైగా బడ్జెట్ తో తీసిన ఈ సినిమా...ఇప్పటికీ 1500 కోట్లు దాటేసింది. ఎర్రచందనం దొంగతనం నేపథ్యంలో పుష్ప సినిమా తీశాడు సుకుమార్. 2021 సంవత్సరంలో విడుదలైన పార్ట్ వన్  బంపర్ హిట్ కావడంతో రెండవ భాగాన్ని కూడా ఈ సంవత్సరం రిలీజ్ చేసి మంచి మార్కులు కొట్టేశాడు సుకుమార్.దాదాపు ఈ సినిమా కోసం మూడు సంవత్సరాలు కష్టపడ్డాడు.
 

ఇక అల్లు అర్జున్ అలాగే రష్మిక మందాన మంచి నటనతో..పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఎక్కడ తగ్గేదే లేదన్నట్లుగా.. ఇప్పటికీ కూడా కలెక్షన్ల వర్షం కురుస్తోంది. పుష్ప 2 సినిమా దెబ్బకు క్రిస్మస్కు కూడా ఏ సినిమాలు ముందుకు రావడం లేదు.ఈ హవా సంక్రాంతి వరకు ఉండే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తోంది.  దాదాపు 2000 కోట్లకు పైగా ఈ సినిమా కలెక్షన్లు రాబట్టనుంది. అలా 2024 సంవత్సరంలో బిగ్గెస్ట్ హిట్టు కొట్టిన దర్శకుడిగా సుకుమార్ నిలిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: