హెరాల్డ్ ఫ్లాష్ బ్యాక్ 2024 : నా సామిరంగతో అదరగొట్టిన విజయ్ బిన్నీ.. ఆ రేంజ్ సక్సెస్ దక్కిందిగా!

Reddy P Rajasekhar
టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోలలో నాగార్జున ఒకరనే సంగతి తెలిసిందే. నాగార్జున సోలో హీరోగా నటించినా మల్టీస్టారర్ సినిమాలో నటించినా కథ అద్భుతంగా ఉంటే మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ ఈ హీరో ఖాతాలో చేరుతుందని చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది. నా సామిరంగ సినిమాతో నాగార్జున బాక్సాఫీస్ వద్ద మరోసారి అలాంటి మ్యాజిక్ చేశారు. విజయ్ బిన్నీ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది.
 
సినిమా ఇండస్ట్రీలో విజయ్ బిన్నీ కొరియోగ్రాఫర్ గా ఊహించని స్థాయిలో పాపులర్ కాగా నా సామిరంగ సినిమాతో ఆయన మరో మెట్టు పైకి ఎదిగారు. ఢీ6 షో ద్వారా విజయ్ బిన్నీకి మంచి గుర్తింపు దక్కింది. డైరెక్టర్ కావాలనే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చానని ఆయన చెప్పుకొచ్చారు. టాలీవుడ్ హీరోలు విజయ్ బిన్నీకి ఛాన్స్ ఇస్తే ఆయన ఖాతాలో మరిన్ని బ్లాక్ బస్టర్ హిట్లు చేరే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
 
నా సామిరంగ సినిమా సంక్రాంతి పండుగ కానుకగా విడుదలై ఇతర సినిమాలతో పోటీ ఉన్నా 20 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం. నా సామిరంగ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది. నాగార్జున విజయ్ బిన్నీ కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. నాగ్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 20 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.
 
విజయ్ బిన్నీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ పరంగా వచ్చే ఏడాది బిజీ అవుతారేమో చూడాల్సి ఉంది. విజయ్ బిన్నీ రెమ్యునరేషన్ ప్రస్తుతం పరిమితంగానే ఉందని తెలుస్తోంది. నాగార్జున విషయానికి వస్తే శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో కుబేర సినిమాలో లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్ లో కూలీ సినిమాలో ఆయన నటిస్తున్నారు. ఈ సినిమాలపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలతో నాగ్ ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాల్సి ఉంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: