ఆర్. నారాయణమూర్తి లవ్‌స్టోరీ తెలుసా.. ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి కోసం అంత త్యాగమా..?
ఎక్కడో తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి మండలం మల్లంపేట అనే గ్రామంలో ఒక పేద రైతు కుటుంబంలో జన్మించారు ఆర్.నారాయణమూర్తి. తెలుగు తెరపై విప్లవాత్మక భావాల ఎర్రదనాన్ని ప్రచారం చేయడం .. దానిని సినిమాగా మలిచి ప్రేక్షకుల మెప్పు పొందారు. దర్శకరత్న దాసరి నారాయణరావు దగ్గర అసిస్టెంట్ గా పని చేస్తూ ఆయన అవకాశాలు అందుకున్నారు. ఆర్ నారాయణ మూర్తి సినిమా అంటే ఇండస్ట్రీలో ఒక సపరేట్ స్టైల్. సినిమాలపై ఆసక్తితో ఎన్టీఆర్ - ఏఎన్ఆర్ సినిమాలు చూసి ఎలా అయినా సినిమాల్లో నటించాలని అనుకున్నారు. ఆయన సినిమాల్లో విప్లవ భావాలు కనిపిస్తాయి. ఎన్నో అద్భుతమైన సినిమాలు నిర్మించారు .. నటించారు నారాయణమూర్తి. దాసరి నారాయణరావు పరిచయంతో కృష్ణ హీరోగా తెరకెక్కిన నేరము శిక్ష సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించే అవకాశం వచ్చింది.
అయితే నారాయణమూర్తి పెళ్లి చేసుకోలేదు .. ఆయనకి కూడా ఒక ప్రేమ కథ ఉంది. ఓ అమ్మాయిని ఆయన ఎంతో ప్రేమించారు .. అయితే నారాయణ మూర్తిని వాళ్ళ తల్లిదండ్రులకు పరిచయం చేసేందుకు ఆమె వాళ్ళ ఇంటికి తీసుకువెళ్లిందట. ఆమె చాలా డబ్బున్న అమ్మాయి .. తాను ప్లాట్ఫారం మీద ఉండే మనిషిని .. ఆమె తనను పెళ్లి చేసుకుంటే ఆమె జీవితం నరకం అవుతుందని భావించి ఆమెకు వివరంగా చెప్పి నన్ను అపార్థం చేసుకోకండి .. మీరు వేరే పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండండి నేను మద్రాసు వెళ్లిపోతున్న మళ్ళీ ఉత్తరాలు రాసుకోవడం అంటివి వద్దు అని చెప్పి అక్కడ నుంచి వచ్చేసారట. అప్పుడు ఆ అమ్మాయి చాలా ఏడ్చిందని .. తాను కూడా ఏడ్చానని ఆ తర్వాత ఆమెతో టచ్ లో లేను ఆమెను చూడాలనిపిస్తుంది. మళ్ళీ వెళ్లి ఆమెను చూసి నేను బాధపడాలి ఎందుకు ? అని వదిలేసాను అని నారాయణమూర్తి అన్నారు.