టాలీవుడ్‌లో ఫిబ్ర‌వ‌రి రిలీజ్ సినిమాల లైన‌ప్ ఇదే.. !

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .
డిసెంబర్ అయిపోయింది .. జనవరి పండగ సినిమాల సంగతి తెలిసిందే. జనవరి మూడోవారం నుంచి శివరాత్రి వరకు టాలీవుడ్ లో వరుసగా సినిమాలు రిలీజ్ కానున్నాయి. సంక్రాంతి కానుకగా బాలకృష్ణ డాకు మహారాజ్ - రామ్ చరణ్ - శంకర్ కాంబినేష‌న్ లో గేమ్ ఛేంజర్ , వెంకటేష్ - అనిల్ రావిపూడి సంక్రాంతి వస్తున్నాం సినిమాలు ఉన్నాయి. మార్చ్ ఫస్ట్ నుంచి నెలాఖరు వరకు రెండు తెలుగు రాష్ట్రాలలో పరీక్షలు సీజన్. అందుకే ఫిబ్రవరిలో కొన్ని సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. సారంగపాణి జాతకం - లైలా మీ ఆడ్ టు - తమ్ముడు , రాబిన్ హుడ్ లాంటి సినిమాలు రేసులో ఉన్నాయి. ఎక్కువమందికి ఫిబ్రవరి 21 మీద కన్ను ఉంది. అక్కడ నుంచి శివరాత్రి సెలవులు ఉన్నాయి. మొత్తం మీద చూసుకుంటే శివ‌రాత్రి పొంగ‌ల్‌ టైంలో వారానికి రెండు వంతెన దాదాపు ఎనిమిది నుంచి పది సినిమాల వరకు వచ్చి పడే అవకాశం కనిపిస్తోంది.

ఇవి కాక ఇంకా చిన్న చిన్న సినిమాలు ఉండనే ఉన్నాయి. ఏది ఏమైనా ఫిబ్రవరిలో నితిన్ నటించిన రాబిన్‌డ్ - తమ్ముడు లాంటి రెండు మంచి అంచనాలు ఉన్న సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. మరి ఈ రెండు సినిమాలు ఫిబ్రవరిలో వస్తాయా ? లేదా దిల్ రాజు పరీక్షలు చేసిన అనంతరం తమ్ముడు సినిమా రిలీజ్ చేస్తారా ? అన్నది చూడాలి. ఇక సంక్రాంతికి ఎలాగో పెద్ద సినిమాల హంగామా ఉంది. జనవరి చివరి వరకు సంక్రాంతి సినిమాల హడావుడి నడుస్తుంది. ఆ తర్వాత మార్చిలో పరీక్షలు ఉండడంతో చాలామంది నిర్మాతలు ఫిబ్రవరిలో తమ సినిమాలు రిలీజ్ చేసేయాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. మ‌రీ టాలీవుడ్ కు అంత ల‌క్ లేని ఫిబ్ర‌వ‌రి నెల వ‌చ్చే యేడాది ఏం చేస్తుందో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: