నిఖిల్ కావ్య లవ్ ట్రాక్.. ప్రేక్షకులని ఎర్రి పప్పలని చేశాడా?
అంతేకాదు నిఖిల్ స్టార్ మాలో ప్రసారమయ్యే ప్రతి షోలో పాల్గొనేవాడు. ఇక బిగ్ బాస్ సీజన్ 8లో ఆఫర్ రావడంతో మొదటి కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టాడు. తన మాట, ఆటతో ప్రేక్షకులను తన వైపుకు తిప్పుకున్నాడు. నిఖిల్ కి మాత్రమే సీజన్ 8 విన్నర్ అయ్యే అర్హత ఉందని ప్రేక్షకుల అందరి నోట అనిపించుకున్నాడు. ఈ సీజన్ లో 22 మంది దాటుకొని 105 రోజులు బిగ్ బాస్ హౌస్ లో జర్నీ చేసి గెలిచాడు. రూ. 55 లక్షల ప్రైజ్ మనీతో పాటు మారుతీ లగ్జరీ కారుని కూడా బహుమతిగా పొందాడు.
ఇక పోతే నిఖిల్ లవ్ లైఫ్ కి వస్తే.. నిఖిల్ హీరోగా నటించిన గోరింటాకు సీరియల్ లో హీరోయిన్ రోల్ చేసిన కావ్య శ్రీతో రిలేషన్షిప్లో ఉన్నారు. అయితే నిఖిల్ బిగ్ బాస్ కి వెళ్ళే ముందు వారికి గొడవ అయిందని సమాచారం. నిఖిల్ బిగ్ బాస్ కి వెళ్లక అక్కడ సోనియాతో క్లోస్ గా ఉన్నట్లు, యాస్మితో లవ్ ట్రాక్ నడిపినట్లు కనిపించింది. చివర్లో బయట నాకు వేరే ఉన్నారని.. బ్రేకప్ అయిందని నిఖిల్ అన్నారు. బిగ్ బాస్ నుండి బయటికి వెళ్లిన తర్వాత తనని కలుస్తానని, తనపై ఉన్న ప్రేమని మళ్లీ వ్యక్తపరుస్తానని ఎమోషనల్ అయ్యాడు. కానీ నిఖిల్ హౌస్ నుండి బయటికి వచ్చి రోజులు గడిచాయి కానీ తాను కావ్య శ్రీ కలవడానికి వెళ్లలేదు. అంతే కాకుండా ఓ ఇంటర్వ్యూలో తన ప్రేమ గురించి ప్రశ్నించినప్పుడు.. మన లైఫ్ లో ఉండాలని ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని అంటూ చెప్పుకొచ్చారు. దీంతో నిఖిల్ కావ్య కలుస్తారా లేదా అని సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.