ఏంటి ఆ కోలీవుడ్ హీరోని నాగార్జున పిలిచి మరీ అవమానించారా..ఇంతకీ ఆ హీరో ఎవరు..ఎందుకు నాగార్జున అవమానించారు.. అసలు సినీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.రీసెంట్గా నాగార్జున హోస్ట్ గా చేసిన బిగ్ బాస్ 8 రియాల్టీ షో ముగిసిన సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ బిగ్ బాస్ 8 ఫినాలేకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ గా వచ్చి విన్నర్ అయినటువంటి నిఖిల్ కి బిగ్ బాస్ ట్రోఫీ ఇచ్చారు. అయితే బిగ్ బాస్ 8 ఫినాలే కి రామ్ చరణ్ కంటే ముందు అల్లు అర్జున్ వస్తాడనే టాక్ వినిపించింది. కానీ అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి గొడవలు ఉన్న కారణంగా ఆయన బిగ్ బాస్ 8 ఫినాలేకి గెస్ట్ గా రాలేకపోయారు.దాంతో బన్నీ పరిస్థితి చూసి వెంటనే సౌత్ లో హీరోగా విలన్ గా మంచి గుర్తింపు సంపాదించిన విజయ్ సేతుపతిని సంప్రదించారట బిగ్ బాస్ యూనిట్.
విజయ్ సేతుపతి కూడా వస్తానని మాట ఇచ్చారట. అయితే సడన్ గా విజయ్ సేతుపతిని కాదని రామ్ చరణ్ ని గెస్ట్ గా తీసుకురావాలని నాగార్జున భావించి వెంటనే రామ్ చరణ్ కి సమాచారం అందించారట. ఇక రామ్ చరణ్ కూడా వస్తానని చెప్పడంతో విజయ్ సేతుపతిని క్యాన్సల్ చేసి రామ్ చరణ్ ని బిగ్ బాస్ ఫినాలేకి గెస్ట్ గా తీసుకువచ్చారు. అయితే ఈ విషయంలో విజయ్ సేతుపతిని పిలిచి మరీ నాగార్జున అవమానించారంటూ విజయ్ సేతుపతి ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు.
ముందుగా ఒక హీరోని రమ్మని ఆ హీరో వస్తానని ఓకే చేశాక కూడా ఆ హీరోని పక్కనపెట్టి మరో హీరోని గెస్ట్ గా తీసుకురావడం విజయ్ సేతుపతికి అవమానమే అంటూ నెట్టింట్లో పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో విజయ్ సేతుపతి నాగార్జునపై నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు.మా హీరో ని పిలిచి మరి అవమానిస్తారా అంటూ నాగార్జునని సోషల్ మీడియాలో ఏకీపారేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ నాగార్జున చేసింది తప్పేనని, ఒక హీరోని రమ్మని పిలిచి ఆ హీరో వస్తానని ఒప్పుకున్నాక మళ్ళీ ఆయన్ని పక్కన పెట్టి మరో హీరోని అవమానించడం ఏమాత్రం బాగోలేదని అంటున్నారు.