ఇండియన్ 3 రిలీజ్ పై శంకర్ షాకింగ్ కామెంట్స్..!!

murali krishna
సినీ ఇండ్ట్రీలో ఇప్పుడు అంటే భారతీయ సినిమాని ఓ రేంజ్ లో నిలబెట్టిన దర్శకుడు ఎవరు అంటే డెఫినెట్ గా దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి అనే అంటారు. ఇపుడు తన టైం నడుస్తుంది బట్ తన కంటే ముందే విఎఫ్ఎక్స్ విషయంలో కానీ ఒక కమర్షియల్ సినిమాల విషయంలో కానీ ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ ని హాలీవుడ్ లో సెట్ చేసిన దర్శకుడు ఎవరు అంటే అది ఖచ్చితంగా శంకర్ అని చెప్పొచ్చు.తమిళ్ ఇండస్ట్రీలో అప్పట్లోనే పాన్ ఇండియా సినిమాలు చేసి హాలీవుడ్ స్థాయి రేంజ్ చిత్రాలని శంకర్ అందించారు. ఆ సినిమాలు చూసి హిందీ ఇండస్ట్రీలో కూడా సై ఫై సినిమాలూ వచ్చాయి. కానీ అలాంటి దర్శకుడు నేడు డౌన్ ఫాల్ కావడం ఆయన ఫ్యాన్స్‌ని ఎంతో బాధిస్తుంది. తన మొదటి సినిమా నుంచి కూడా ఇప్పటికీ ప్రతీ సినిమాను ఆడియన్స్ రిపీట్ చేసే రేంజ్ లో కనిపిస్తాయి.అలాంటి లెవెల్ ఉన్న శంకర్ ఇపుడు దారుణంగా డిజాస్టర్స్‌ని అందిస్తున్నారు. హీరో విజయ్ తో చేసిన స్నేహితుడు సినిమా నుంచి శంకర్ కి ప్లాప్ లు స్టార్ట్ కాగా మొన్న వచ్చిన ఇండియన్ 2 తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్లాప్ అయ్యింది. దీనితో పరిస్థితులు ఎలా వచ్చాయి అంటే ఇండియన్ 3 ని థియేటర్స్ లో కాదు నేరుగా ఓటిటిలో రిలీజ్ చేస్తారు అంటూ పలు షాకింగ్ రూమర్స్ వచ్చాయి.

దీనితో శంకర్ లాంటి దర్శకుడు తెరకెక్కించిన సినిమా నేరుగా ఓటిటి రిలీజ్ అంటే అది తనకే పెద్ద అవమానం అని చెప్పి తీరాలి. కాగా అక్కడి నుంచి ఇండియన్ 3 పరిస్థితి ఏంటి అనేది సస్పెన్స్ గా మారగా ఓ పక్క నెట్ ఫ్లిక్స్ లోనే సినిమా వచ్చేస్తుందని రూమర్స్ మొదలయ్యాయి. ఇంకోపక్క రిలీజ్ క్లారిటీ లేకపోవడంతో ఇండియన్ 3 అసలు ఉన్నట్టా లేనట్టా అనేది కూడా ఆసక్తిగా మారింది.దీంతో స్వయంగా శంకర్ నోరు విప్పారు. ఇటీవల తమిళనాట ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఇండియన్ 3 సినిమా డెఫినెట్ గా థియేటర్స్ లోనే రిలీజ్ అవుతుంది అని క్లారిటీ ఇచ్చారు. కమల్ సర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని పార్ట్ 2‌కి అలాంటి రిజల్ట్ వస్తుంది అనుకోలేదు , కానీ పార్ట్ 3 మాత్రం వర్క్ అవుతుంది అని శంకర్ ధీమా వ్యక్తం చేశారు.ఈ సినిమా‌ను థియేటర్స్‌లోనే రిలీజ్ చేస్తామని శంకర్ క్లారిటీ ఇచ్చారు. సో ఈ బిగ్ ప్రాజెక్ట్ ఎలాంటి ఓటిటిలో రాదనే చెప్పాలి. కాగా ఈ పార్ట్ 3లో కాజల్ అగర్వాల్ ఫుల్ లెంగ్త్ లో కనిపించనుండగా పార్ట్ 2 ఎండింగ్‌లో ఇచ్చిన ట్రైలర్‌కి కూడా చాలా మంది ఎగ్జైట్ అయ్యారు. మరి ఈ మూడో భాగం ఎప్పుడు రిలీజ్ ఏంటి అనే డీటెయిల్స్ ఎప్పుడు బయటికి వస్తుందో చూడాలి మరి.ఇదిలావుండగా శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కిన రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 10న రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే వరుస ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు చిత్ర బృందం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: