హెరాల్డ్ ప్లాష్‌బ్యాక్ 2024 : నార్త్ లో మంట రేపుతున్న సౌత్ కెప్టెన్స్ .. 2024 లో గట్టిగానే పెట్టారుగా..!

Amruth kumar
రూల్ చేయటం మొదలు పెడితే మాకంటే ఎవరూ బాగా రూల్ చేయలేరు అంటున్నారు మన డైరెక్టర్లు .. భాష తో సంబంధం లేదు .. ఇండియన్ సినిమాను నడిపిస్తుంది మాత్రం సౌత్ దర్శకులే. అది పుష్ప తో సుకుమార్ కావచ్చు .. యానిమల్ తో సందీప్ వంగా అవ్వచ్చు .. వీటికి పునాదులు వేసిన రాజమౌళి అయినా కావచ్చు .. అందరూ మన దర్శకులే .. బాలీవుడ్లో మేము సౌత్ నుంచి వచ్చామంటే చాలు ఆ దర్శకులకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారు హీరోలు నిర్మాతలు .

అందుకే ప్లాప్‌ల్లో ఉన్నా కూడా సౌత్ దర్శకులనే బ్రాండ్ తోనే మురగదాస్ కు అవకాశం ఇచ్చారు సల్మాన్ ఖాన్ .. మరో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ బేబీ జాన్ కు  కర్త కర్మ క్రియ అంతా అట్లినే.. జవాన్ మూవీ తో బాలీవుడ్ ను దడ పుట్టించాడు . ఇక రన్‎బీర్ కపూర్ హీరోగా వచ్చిన య‌నిమల్ తో బాలీవుడ్‌కు కొత్త రూట్ చూపించాడు సందీప్ రెడ్డి వంగ .. ఇక పుష్ప 2 టేకింగ్ , మేకింగ్ చూశాక సుకుమార్ కు దండేసి దండం పెడుతున్నారు నార్త్ ప్రేక్షకులు .. అలాగే నువ్వు అక్కడే ఉండిపో అంటూ పూజలు కూడా చేస్తున్నారు .

అలాగే ఇక కేజిఎఫ్ , సలార్ సినిమాలతో ప్రశాంత్ నీల్ , బాహుబలి సిరీస్ తో రాజమౌళి ఇప్పటికే బాలీవుడ్లో జెండా పాతేశారు .. ఎవరు ఊహించని అవకాశంతో గోపీచంద్ మలినేని తాను కూడా జెండా పాతాలని చూస్తున్నారు .. ఫైర్ ఫైర్స్ ది ఫైర్ అన్నట్లుంది ఇప్పుడు సౌత్ డైరెక్టర్స్ దూకుడు చూస్తుంటే..! ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇండియన్ సినిమాను ఇక్కడ్నుంచే రూల్ చేస్తున్నారు మనోళ్లు. కలెక్షన్లు రావాలన్నా.. రికార్డులు సృష్టించాలన్నా.. కొత్త రికార్డులు తిరగరాయాలన్నా అన్నీ దక్షిణాది దర్శకులే చేస్తున్నారిప్పుడు. ఇలా మొత్తంగా 2024 సంవత్సరంలో మొత్తం ఇండియన్ సినిమాను మన సౌత్ నుంచే రూల్ చేస్తున్నారు మన దర్శకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: