అదంతా ఫేక్ న్యూస్.. ఇండియన్-3 పై శంకర్ క్లారిటీ?
మొన్న వచ్చిన ఇండియన్ 2 శంకర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ప్లాప్ గా నిలిచింది. దాంతో పరిస్థితులు ఎలా తయారయ్యాయి అంటే? ఇండియన్ 3 ని థియేటర్స్ లో కాదు నేరుగా ఓటిటిలో రిలీజ్ చేస్తారు అంటూ పలు షాకింగ్ రూమర్స్ సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. దాంతో శంకర్ లాంటి దర్శకుడు తెరకెక్కించిన సినిమా నేరుగా ఓటిటి రిలీజ్ అంటే అది తనకే పెద్ద అవమానం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా అక్కడి నుంచి ఇండియన్ 3 పరిస్థితి ఏంటి అనేది సస్పెన్స్ గా మారుతున్న తరుణంలో స్వయంగా శంకర్ ఈ రూమర్ పైన క్లారిటీ ఇచ్చారు. ఇటీవల తమిళనాట ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఇండియన్ 3 సినిమా డెఫినెట్ గా థియేటర్స్ లోనే రిలీజ్ అవుతుంది అని క్లారిటీ ఇచ్చేసారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కమల్ సర్ ఫ్యాన్స్ ఈ సారి మాత్రం కాలర్ ఎగరెత్తేలా పార్ట్ 3 ఉంటుంది... అని శంకర్ ధీమా వ్యక్తం చేశారు. ఈ సినిమాను థియేటర్స్‌లోనే రిలీజ్ చేస్తామని శంకర్ క్లారిటీ ఇచ్చారు. కాబట్టి ఈ బిగ్ ప్రాజెక్ట్ ఎలాంటి ఓటిటిలో రాదని అర్ధం అవుతోంది. ఇకపోతే ఇండియన్ పార్ట్ 3లో కాజల్ అగర్వాల్ ఫుల్ లెంగ్త్ లో కనిపించనుంది. పార్ట్ 2 ఎండింగ్‌లో ఇచ్చిన ట్రైలర్‌కి కూడా చాలా మంది ఎగ్జైట్ అయ్యారు. మరి ఈ మూడో భాగం రిలీజ్ ఏంటి? అనే డీటెయిల్స్ మాత్రం ఇంకా అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. అయితే ఇప్పటికే షూటింగ్ పూర్తయినట్టు వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఈ సంక్రాతి కానుకగా శంకర్ - రామ్ చరణ్ కాంబో 'గేమ్ చెంజర్' సినిమా విడుదలకాబోతోంది. ఈ సినిమాకోసం యావత్ ఇండియన్ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.