ఇక హీరోయిన్ల అలాంటి కండిషన్‌లు చెల్లవు .. షాక్ ఇవ్వడానికి రెడీ అయిన నిర్మాతలు..?
రీసెంట్ గానే ఓ స్టార్ హీరోయిన్ తో ఓ అగ్ర నిర్మాత ఇలాంటి అగ్రిమెంట్ చేసుకోవడానికి వెళ్లిన సమయంలో.. ఓటీటీ పరిస్థితి పూర్తిగా వారి దగ్గర వివరించి హీరోయిన్ డిమాండ్ ఎంత ? నిర్మాతగా తాను ఎంత ఇవ్వగలను ? సినిమా హిట్ అయితే వచ్చే లాభా నష్టాలను ఓ అంచనాగ ఆ హీరోయిన్ కి చెప్పాడట .. సదరు ఆ హీరోయిన్ ఇవన్నీ నాకెందుకు అని అడిగిందట .. ఇక ఆ నిర్మాత ఆ లెక్కలన్నీ మీకు తెలియాలని చెప్పాడట .. ఇక నిర్మాత కండిషన్లో అన్ని తనకి ఓకే అయితేనే ఒప్పందం చేసుకుందామని లేదంటే ఇప్పుడే తేల్చి చెప్పేయడంని అన్నాడట .. ఇక దాంతో ఆ హీరోయిన్ ఆ నిర్మాతని హోల్డ్ లో పెట్టినట్టు తెలుస్తుంది.
అలాగే మరి కొంతమంది హీరోయిన్లు కథల విషయంలో ఏమాత్రం అవగాహన లేకుండా ఒప్పుకోవటం నిర్మాతకు నష్టం చేస్తుందని మరో అంశం తెరపైకి వచ్చింది .. ఇది కొంతమంది హీరోయిన్లు ఎలాంటి ఆలోచనలు లేకుండా ఉన్నట్లు కనిపిస్తుంది .. నిర్మాత ఒక కథ చెబితే తీర సెట్స్ కి వెళ్లి తర్వాత మరో కథలో నటిస్తున్నారట .. ఎందుకు జరుగుతుంది అని నిర్మాతని హీరోయిన్లు అడగటమే లేదట .. అక్కడ వారి డొల్లతనం కనిపిస్తుంది రెమినరేషన్ వచ్చిందా లేదా అన్నది చూస్తున్నారు .. తప్ప చేసే సినిమా హిట్టా .. పట్టా.. అన్నది వారు పట్టించుకోవడంలేదని .. పనిపాట్ల అసలు శ్రద్ధ కూడా లేకుండా కొంతమంది నటిస్తున్నారని ఓ నిర్మాత చెప్పుకొచ్చారు. ఇక రాబోయే రోజుల్లో హీరోయిన్ల విషయంలో మరింత కఠిన నిర్ణయాలు నిర్మాతలు తీసుకోబోతున్నారని కూడా అర్థమవుతుంది .