టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరో గా నటించాడు. గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి కియార అద్వానీ , చరణ్ కు జోడిగా నటించగా ... అంజలి , సునీల్ , శ్రీకాంత్ , నవీన్ చంద్ర , జయరాం ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు.
ఈ సినిమాకు ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించగా ... ఎస్ జె సూర్య ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు ప్రచారాలను కూడా పెద్ద ఎత్తున నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా రేపు అనగా డిసెంబర్ 21 వ తేదీన ఈ మూవీ బృందం వారు అమెరికాలో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ను కూడా నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వెలువడింది.
ఇకపోతే జనవరి నెలలో ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించనున్నట్లు దానికి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా రానున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే గతంలో చరణ్ నటించిన రంగస్థలం మూవీ సక్సెస్ మీట్ కి పవన్ ముఖ్య అతిథిగా వచ్చాడు. గేమ్ చేంజర్ విషయంలో కూడా చరణ్ రంగస్థలం సినిమా సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నాడు అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.