ఒంటిపై బట్టలు లేకుండా నటించిన స్టార్ సెలబ్రిటీలు .. లిస్టులో టాలీవుడ్ అగ్ర హీరోలు కూడా..!

Amruth kumar
ఈ రీసెంట్ టైమ్స్ లో సెలబ్రిటీలు తాము నటించే సినిమాల్లో తమ పాత్ర కోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి రెడీ అవుతున్నారు .. ఏకంగా ఒంటిపై నూలు పోగు లేకుండా తెర‌పై కనిపించే సాహసం చేయడానికి కూడా వెనకాడట్లేదు .. పైగా ఫ్యామిలీతో కలిసి చూడలేని సన్నివేశాల్లో కనిపిస్తూ కొన్నిసార్లు విమర్శలకు పాలవుతున్నారు .. ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత మితిమీరిన సన్నివేశాలను విచ్చలవిడిగా చూపిస్తున్నారు .. ఇక ప్రస్తుతం జీ5 అనే ఓటీటీలో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్  ‘డిస్పాచ్’ లో మనోజ్ బాజ్పాయ్ ఒంటిపై బట్టలు లేకుండా హీరోయిన్ తో కలిసి నటించిన సన్నివేశం ఇప్పుడు ఎంతో హాట్ టాపిక్ అవుతుంది .. ఈ క్రమంలోనే ఇప్పటివరకు చిత్ర పరిశ్రమలో అందులోనూ మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఇలా ఒంటిపై బట్టలు లేకుండా నటించిన నటీనటులు ఎవరో ఒకసారి లుక్ వేద్దాం.

ఓటీటీ వాడ‌కం ఎక్కువయ్యాక ఇలాంటి సన్నివేశాలు ఎక్కువ వైరల్ అవుతున్నాయి. కానీ మన తెలుగు స్టార్స్ మాత్రం ఎప్పుడో దశాబ్దం క్రితమే ఇలాంటి సన్నివేశాలో నటించారు .  వారిలో శ్రీకాంత్ , ప్రకాష్ రాజ్ , అల్లరి నరేష్ , సంపూర్ణేష్ బాబు వంటి వారు ఉన్నారు .. ఒంగోలు గిత్త సినిమాలో ప్రకాష్ రాజ్ ఒంటిపై బట్టలు లేకుండా రూమ్లో ఉన్న సీన్ ను అప్పట్లో ఎంతో హాట్‌ టాపిక్ గా మారింది .. ఈ ఒక్క సీనుకోసమే అప్పట్లో ఒంగోలు గిత్త సినిమాకు ఏ రేటింగ్ ఇచ్చారు. వీటి కంటే చాలా రోజుల ముందు ఆపరేషన్ దుర్యోధన సినిమాలో సీనియర్ హీరో శ్రీకాంత్ కూడా ఇలా నటించే సాహసం చేశారు .. 2003లో రిలీజ్ అయిన బాయ్స్ సినిమాలో సిద్ధార్థ్ కూడా ఓ సన్నివేశంలో నగ్నంగా రోడ్డుపై పరిగెత్తే సన్నివేశం ఉంటుంది. ఈగ మూవీలో సుదీప్ కూడా ఒక సునవేషంలో ఒంటిపై బట్టలు లేకుండా కనిపిస్తాడు. అదే విధంగా అల్లరి నరేష్ కూడా నాంది సినిమాలో జైల్లో ఇలాంటి ఒంటిపై బట్టలు లేకుండా ఓ సీను చేశారు . అలాగే సంపూర్ణేష్ బాబు కాలీఫ్లవర్ అనే సినిమాలో ఒంటిపై బట్టలు లేకుండా కనిపించి హాట్ టాపిక్ గా మారారు.

ఇప్పటివరకు సౌత్ లో ఇలా వెండితెరపై బట్టలు లేకుండా కనిపించిన హీరోల గురించి మాట్లాడుకున్నం .. అయితే ఇప్పుడు హీరోయిన్ల గురించి కూడా కూడా ఒకసారి చూద్దాం .. ఈ లిస్టులో మర్చిపోకుండా చెప్పుకోవలసిన హీరోయిన్ పేరు అమలాపాల్.. ఈ డేరింగ్ అండ్ డాషింగ్‌ హీరోయిన్ 2019 లో ఆమె అనే సినిమాలో కొన్ని సన్నివేశాలు పూర్తిగా నగ్నంగా నటించింది. ఇక మన సౌత్ స్టార్స్ విషయం ఇలా ఉంచితే.. బాలీవుడ్ లో ఈ ట్రెండ్ కాస్త ఎక్కువగానే నడిచింది .. అక్కడైతే ఏకంగా స్టార్ హీరోలే ఇలా ఒంటిపై అసలు బట్టలు లేకుండా వెండితెరపై కనిపించి సంచలనాలు క్రియేట్ చేశారు.  ఈ లిస్టులో ముందుకు చెప్పక కావాల్సిందే రణ‌బీర్‌ కపూర్.. ఆయన నటించిన మొదటి మూవీస్ సావరియా తో పాటు యానిమల్ , సంజు , బేషరమ్ వంటి సినిమాల్లో ఒంటపై బట్టలు లేకుండా కనిపించి షాక్ ఇచ్చాడు .. అదేవిధంగా పీకే సినిమా కోసం అమీర్ ఖాన్ కూడా .. ఇలానే కనిపించాడు.. ఇక ది వెడ్డింగ్ గోస్ట్ మూవీలో రాధిక ఆప్టే  లాంటి హీరోయిన్లు కూడా వెండితెరపై ఇలాంటి సాహసం చేశారు .. ఇక ఓటీటీ ట్రెండ్ మొదలయ్యాక ఇలా చాలామంది అగ్ర నటులు తెరపై ఇలా కనిపించారు .. కానీ ఇప్పుడు తాజాగా మనోజ్ బాజ్ పేయి హద్దుమూరి నటించిన సీన్స్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: