తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 5 మూవీస్ ఇవే..?

Pulgam Srinivas
తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ షేర్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 5 మూవీస్ ఏవో తెలుసుకుందాం.

ఆర్ ఆర్ ఆర్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ మూవీ టోటల్ బాక్సాఫీస్ రన్ ముగిసే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 272.31 కోట్ల షేర్ కలక్షన్లను వసూలు చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ షేర్ కలక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో మొదటి స్థానంలో నిలిచింది.

బాహుబలి 2 : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా టోటల్ బాక్సాఫీస్ రన్ ముగిసే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 204 షేర్ కలెక్షన్లను వసూలు చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ షేర్ కలక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో రెండవ స్థానంలో నిలిచింది.

పుష్ప పార్ట్ 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 5 వ తేదీన విడుదల అయ్యి ఇప్పటివరకు 15 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. 15 రోజుల్లో ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 199.15 కోట్ల షేర్ కలక్షన్లను వసూలు చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ షేర్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో మూడవ స్థానంలో ఉంది.

కల్కి 2898 AD : ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా టోటల్ బాక్సాఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో 187.27 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ షేర్ కలక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో నాలుగవ స్థానంలో నిలిచింది.

దేవర పార్ట్ 1 : జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా టోటల్ బాక్సాఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 162.80 కోట్ల షేర్ కలక్షన్లను వసూలు చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ షేర్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో ఐదవ స్థానంలో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: