తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నిర్మాతలలో దిల్ రాజు ఒకరు. ఇకపోతే ఈయన కొన్ని సంవత్సరాల క్రితం సునీల్ హీరో గా వాసు వర్మ దర్శకత్వంలో కృష్ణాష్టమి అనే సినిమాను రూపొందించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. కొన్ని రోజుల క్రితం ఇంటర్వ్యూలో పాల్గొన్న దిల్ రాజు ఈ సినిమా ఫ్లాప్ కావడానికి గల కారణాలను వివరించాడు. కృష్ణాష్టమి మూవీ గురించి దిల్ రాజు మాట్లాడుతూ ... వాసు వర్మ మా బ్యానర్ లో జోష్ అనే సినిమాతో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టాడు.
ఆ సినిమా పెద్దగా ఆడలేదు. దానితో ఆయనతో నేను మరో సినిమా చేయాలి అనుకున్నాను. ఆయన చాలా రోజుల తర్వాత ఒక రచయిత దగ్గర కృష్ణాష్టమి మూవీ కి సంబంధించిన కథను తీసుకున్నాడు. అది నాకు బాగా నచ్చింది. కానీ కథ దొరికిన వెంటనే ఆ కథకు హీరో సెట్ కాలేదు. హీరో సెట్ కావడానికి కొంత సమయం పట్టడంతో ఆ గ్యాప్ లో మేము ఆ కథలో అనేక మార్పులు , చేర్పులు చేశాం. ఇక సునీల్ హీరో గా సెలెక్ట్ అయ్యాడు. మేము మార్పులు , చేర్పులు చేసిన కథతో ఆ సినిమాను మొదలు పెట్టాం. ఇక సినిమా విడుదల అయింది. కాని పెద్దగా సక్సెస్ కాలేదు. మొదట మా దగ్గర ఉన్న కథ మంచి కామెడీ ఎంటర్టైనర్. దాన్ని అలాగే తీస్తే హిట్ అయ్యేదేమో.
మేము అనవసరంగా ఆ కథలో అనేక మార్పులు , చేర్పులు చేసి ఆ సినిమాను రూపొందించాం. అక్కడే ఆ సినిమా తేడా కొట్టింది అని దిల్ రాజు తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు. ఇకపోతే దిల్ రాజు ప్రస్తుతం గేమ్ చేంజర్ , సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలను నిర్మిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కానున్నాయి.