శ్రీ తేజ హెల్త్ బులిటెన్ విడుదల చేసిన కిమ్స్ హాస్పిటల్.. ఇప్పుడు ఎలా ఉందంటే..?

Divya
పుష్ప2  రిలీజ్ సమయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించగా ఆమె కుమారుడు శ్రీ తేజ పరిస్థితి కూడా తీవ్రంగానే ఉందంటూ వార్తలు వినిపించాయి.. ఇలాంటి సమయంలోనే అల్లు అర్జున్ కూడా తెలంగాణ పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా శ్రీ తేజ పేరు వైరల్ గా మారడమే కాకుండా ఈ అబ్బాయి పరిస్థితి గురించి రోజుకు ఒక విషయం వినిపిస్తూ ఉన్నది. ఇటీవలే కిమ్స్ హాస్పిటల్ వైద్యులు శ్రీ తేజ ఆరోగ్య పరిస్థితి పైన ఒక హెల్త్ బులిటెన్ విడుదల చేశారు..

ప్రస్తుతం శ్రీ తేజ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వెంటిలేటర్ పైన చికిత్స అందిస్తున్నామని ఫీడింగ్ కూడా తీసుకుంటున్నారని అప్పుడప్పుడు ఫిట్స్ వస్తున్నాయంటూ తెలిపారు. కళ్ళు తెరుస్తున్నప్పుడు మనుషులను గుర్తుపట్టలేదని కిమ్స్ వైద్యలో తెలియజేశారు. పుష్ప 2  సినిమా ప్రీమియర్ షో చూడడానికి వెళ్లిన రేణుక అతని కుమారుడు సంధ్య థియేటర్ వద్ద జరిగా తొక్కిసలాటలో భాగంగా రేవతి మరణించగా ఇక ఆమె కుమారుడు శ్రీ తేజ ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.

శ్రీ తేజకు ఇలా జరగడంతో అల్లు అర్జున్ శ్రీ తేజకు అన్ని చూసుకుంటానంటూ తెలియజేశారు. ఇప్పటికే డైరెక్టర్ సుకుమార్ తో పాటు అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ నిర్మాత బన్నీ వాసు తదితరులు సైతం కిమ్స్ వైద్యులకు కలిసి శ్రీ తేజ ఆరోగ్య పరిస్థితిలను కూడా తెలుసుకున్నట్లు తెలుస్తోంది. ఎప్పటికప్పుడు శ్రీ తేజ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటూ కొంటున్నారు అల్లు అర్జున్. మొత్తానికి శ్రీ తేజ ఆరోగ్యంగా కోలుకొని బయటికి వస్తే అల్లు అర్జున్  కి కొంతమేర ఊరట  లభిస్తుంది.. ఒకవైపు రికార్డులతో పుష్ప 2 సినిమా దూసుకుపోతున్నప్పటికీ ఈ సంఘటన వల్ల అటు పుష్ప 2 చిత్ర బృందానికి కాస్త నిరాశ మిగులుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: