తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న నటులలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఈయన ఈ సంవత్సరం దేవర పార్ట్ 1 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని జాన్వి కపూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసి సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే ప్రస్తుతం తారక్ "వార్ 2" అనే హిందీ సినిమాలో నటిస్తున్నాడు.
ఈ మూవీ లో హృతిక్ రోషన్ , తారక్ తో కలిసి నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ఇది ఇలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ పలు మార్లు తమిళ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా కెరీర్ ను కొనసాగిస్తున్న వెట్రిమారన్ దర్శకత్వంలో తనకు సినిమా చేయాలని ఉంది అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇకపోతే ఈయన గతంలో ఈయన దర్శకత్వం వహించిన సినిమాలలో చాలా సినిమాలు అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. కొంత కాలం క్రితం ఈయన విడుదల పార్ట్ 1 అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో సూరి , విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలలో నటించారు.
ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఈయన విడుదల పార్ట్ 2 సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా నిన్న అనగా అనగా డిసెంబర్ 20 వ తేదీన విడుదల అయింది. ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ లభించింది. ఇక ఇలా ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ లభించడంతో తారక్ , వెట్రీమారన్ దర్శకత్వంలో ఎప్పుడు సినిమా చేస్తాడో ... చేస్తే అతనితో ఆయన ఎలాంటి సినిమా ప్లాన్ చేస్తాడా అనే ప్రశ్నలు అనేకం వైరల్ అవుతున్నాయి.