రామ్ చరణ్ మొబైల్ లో డెవిల్ అంటూ ఏ హీరోయిన్ నేమ్ సేవ్ చేసుకున్నారో తెలుసా..? షాక్ అయిపోతారు..!

Thota Jaya Madhuri
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంత హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారిందో మనం చూస్తూనే ఉన్నాం . జనవరి 10వ తేదీ ఆయన నటించిన గేమ్ ఛేంజర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది.  పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిన ఈ సినిమా అదే స్థాయిలో రిలీజ్ కాబోతుంది . ఈ సినిమా కోసం మెగా పవర్ స్టార్ రాంచరణ్ చాలా చాలా కష్టపడ్డాడు . ఆర్ ఆర్ ఆర్ తర్వాత అంత పెద్ద హిట్ అవుతుంది ఈ సినిమా అంటూ ఫ్యాన్స్ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు .


మరికొద్ది గంటల్లోనే అమెరికాలో ఈ సినిమా కి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు మేకర్స్ . ఫర్ ద ఫస్ట్ టైం ఇండియన్ హిస్టరీలోనే ఇలా వేరే కంట్రీలో ఓ సినిమాకి ప్రీ  రిలీజ్ ఈవెంట్ చేయడం ఇదే మొదటిసారి . అంతేకాదు ఇండియాలో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నారు. జనవరి 4వ తేదీ ఇండియాలో గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈవెంట్ కి ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా రాబోతున్నారట .


రామ్ చరణ్ కి సంబంధించిన పలు వార్తలు బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారాయి. రామ్ చరణ్ చాలా తక్కువగా మొబైల్ వాడుతారట. అయితే రామ్ చరణ్ తన మొబైల్ లో డెవిల్ అంటూ ఓ హీరోయిన్ నేమ్ సేవ్ చేసుకున్నారు అంటూ ఓ నాటీ న్యూస్ బయటపడ్డింది. ఆమె మరి ఎవరో కాదు తన చెల్లి "నిహారిక". ఎస్ నిహారిక అంటే మొదటి నుంచి రామ్ చరణ్ కి చాలా చాలా ఇష్టం . చాలా అల్లరి కూడా చేస్తూ ఉంటుంది . నిహారికను ముద్దుగా డెవిల్ అంటూ  కొన్ని సందర్భాలలో పిలుస్తూ ఉంటారట రామ్ చరణ్ . ఇక అదేవిధంగా మొబైల్లో అదే నేమ్ తో సేవ్ చేసుకున్నారట రామ్ చరణ్ . ప్రజెంట్ ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: