హెరాల్డ్ పాలిటిక్స్ 2024 : తన మార్క్ పాలనతో అదరగొడుతున్న రేవంత్.. ఆ విషయాల్లో ఎవరూ సాటిరారుగా!
రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి రెండో సీఎం కాగా సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలకు మేలు చేసేలా ఆయన కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. గతేడాది డిసెంబర్ నెల 7వ తేదీన సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. 1992 సంవత్సరంలో రేవంత్ రెడ్డి వివాహం జరగగా మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి తమ్ముడి కూతురు గీతా రెడ్డిని ప్రేమించి, పెద్దలను ఒప్పించి రేవంత్ రెడ్డి వివాహం చేసుకున్నారు.
రేవంత్ రెడ్డి దంపతులకు ఒకే ఒక కూతురు కాగా ఆ కూతురు పేరు నైమిషా రెడ్డి. రేవంత్ రెడ్డి పథకాలను ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒకవైపు సినీ ఇండస్ట్రీకి అండగా నిలబడుతూనే మరోవైపు తప్పు చేసిన వాళ్లు ఎంత పెద్ద సెలబ్రిటిలు అయినా వదలడం లేదు. రేవంత్ రెడ్డి ధరణి స్కీమ్ ను భూ భారతి పేరుతో మార్పు చేయడం గమనార్హం.
రేవంత్ రెడ్డి ప్రజలకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీర్ఘకాలంలో ప్రజలకు మంచి జరిగే నిర్ణయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం మరింత శరవేగంగా అభివృద్ధి జరగాలని ప్రజలు కోరుకుంటున్నారు. రేవంత్ రెడ్డి పాలన ఇదే విధంగా కొనసాగితే 2028 సంవత్సరంలో కూడా రేవంత్ రెడ్డి మళ్లీ సీఎం అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. రేవంత్ రెడ్డి పాలనకు ప్రజలు జై కొడుతుండటం గమనార్హం.