పుష్ప 2 లో కొత్తగా 18 నిమిషాలు... 25 నుంచి థియేటర్లలో కొత్త వెర్షన్.. ?
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప పార్ట్ 2 సినిమా ఈ నెల ఐదున ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చి పాన్ ఇండియా రేంజ్ లో ఏ స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అందరం చూసాం. ఇప్పటికే థియేటర్లలో విజయవంతంగా రెండు వారాల రన్ పూర్తి చేసుకున్న పుష్ప గాడు రు . 1500 కోట్ల గ్రాస్ వసూళ్లు దాటేసి బాహుబలి 2 రికార్డులకు గురిపెట్టి దూసుకుపోతున్నాడు. అల్లు అర్జున్ ఒక్క దెబ్బకు నేషనల్ స్టార్ అయిపోయాడు. నిజంగానే పుష్ప అంటే నేషనల్ అనుకుంటి వా .. ఇంటర్నేషన ల్ అనేలా ఈ సినిమా ఉంది. ఇది ఇలా ఉంటే ఈ రన్ టైం దాదాపు 200 నిమిషాలుగా వచ్చింది. అయితే అప్పటికే నిడివి బాగా పెరిగిపోవడంతో కొంత కట్ చేయించారు. ఇప్పుడు సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడంతో ట్రిమ్ చేసిన నిడివి ఉన్న ఫుటేజ్ కూడా యాడ్ చేయబోతున్నారట.
పుష్ప పార్ట్ 2 కొత్త వెర్షన్ మేకర్స్ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న నిడివికి మరో 18 నిమిషాల పుటేజ్ కలిపారని .. దీనిని ఈనెల 25 నుంచి థియేటర్లలో ప్రదర్శిస్తారని టాక్. ప్రస్తుతం ఈ సినిమా రన్ టైం 200 నిమిషాలు ఉంది. కొత్త సీన్లు కలిపితే మూడు గంటల ముప్పై నిమిషాలు అవుతుంది. కలెక్షన్లు పెంచేందుకు ఈ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. మరి ఈ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ ? అవుతుందో చూడాలి. ఇక ఈ సినిమా లో బన్నీ కి జోడీగా నేషనల్ క్రిష్మిక రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా శ్రీలీల స్పెషల్ సాంగ్ లో నటించింది. రాక్ స్టార్ దేవిశ్రీ సంగీతం అందించారు.