మరో ఉప్పెన కోసం బేబమ్మ పాట్లు..!
బేబమ్మగా హిట్ అందుకున్న కృతి శెట్టి ఆ తర్వాత ఆ రేంజ్ హిట్ ఒక్కటి అందుకోలేదు. వరుస ఫ్లాపుల వల్ల అమ్మడికి ఛాన్సులు కూడా కరువయ్యాయి. అందుకే ఇక గ్లామర్ విషయంలో టాప్ గేర్ వేస్తేనే పని అవుతుందని ఫిక్స్ అయ్యింది కృతి శెట్టి. ఉప్పెన టైం లో కూడా ఫోటో షూట్స్ చేసినా అసలేమాత్రం స్కిన్ కనిపించకుండా చేసింది. ఐతే ఇప్పుడు అవకాశాల కోసం స్లీవ్ లెస్ అందాలతో ఎట్రాక్ చేసే ప్రయత్నం చేస్తుంది.
కృతి శెట్టి స్లీవ్ లెస్ అందాలకు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. తనని ఈ యాంగిల్ లో అసలు ఊహించలేని ఫ్యాన్స్ కూడా బేబమ్మలో కూడా చాలా మ్యాటర్ ఉందే అని అనుకుంటున్నారు. కెరీర్ లో వరుస ఫ్లాపులు ఛాన్సులు రాకుండా చేయగా ఇన్నాళ్లు గ్లామర్ పరంగా కనిపించడానికి సుముఖంగా లేక కాదన్న కొన్ని కథలను మళ్లీ తన దగ్గరకు వచ్చేలా చేస్తుంది. అందుకే అమ్మడు ఇలా గ్లామర్ ఫోటో షూట్స్ తో తన సోషల్ మీడియా నింపేస్తుంది. కృతి చేస్తున్న ఈ షో చూసి కచ్చితంగా దర్శక నిర్మాతలు ఛాన్స్ ఇస్తారని చెప్పొచ్చు. కృతి శెట్టి ఈ ఇయర్ లో శర్వానంద్ తో మనమే సినిమా చేసింది. ఆ సినిమా వర్క్ అవుట్ కాలేదు. మలయాళంలో సక్సెస్ ఫాం లో ఉన్న టోవినో థామస్ తో ఎ.ఆర్.ఎం సినిమా కూడా చేసింది. ఐతే ఆ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయినా మిగతా భాషల్లో మెప్పించలేదు. ప్రస్తుతం తమిళ్ లోనే రెండు సినిమాలు చేస్తుంది కృతి శెట్టి.