టాలీవుడ్ జక్కన్న బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచారు. ఇండియన్ సినిమా స్టామినాను అంతర్జాతీయ స్థాయిలో చాటి చెప్పిన రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా కోసం రెడీ అవుతున్నారు. ఆర్ఆర్ఆర్ విడుదల అయ్యి దాదాపు మూడు ఏళ్లు కావస్తుంది. ఎట్టకేలకు ఆయన తన తదుపరి సినిమాకి క్లాప్ కొట్టబోతున్నారు. సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ బాబుతో రాజమౌళి రూపొందించబోతున్న సినిమా పూజా కార్యక్రమాలు 2025 జనవరిలో జరగబోతున్నాయి. ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయనే వార్తలు వస్తున్నాయి.అయితే రాబోయే రోజుల్లో కేవలం ఇండియన్ బాక్సాఫీస్ నుంచి ఒక్క రోజులోనే 500 కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టగలిగే సత్తా ఏదన్నా సినిమాకి ఉందా అనే ప్రశ్నకి ఖచ్చితంగా నిలిచే సమాధానపు కాంబినేషన్ ఏదన్నా ఉంది అంటే అది నిర్మొహమాటంగా ఎస్ ఎస్ రాజమౌళి అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబుల కాంబినేషన్ అని చెప్పవచ్చు. గ్లోబల్ గా రాజమౌళికి ఉన్న ఫేమ్ అందుకు తగ్గట్టుగా మహేష్ బాబుకి ఉన్న సాలిడ్ కటౌట్ తో ఈ మార్క్ ని ఈజీగా తీసుకొస్తారని చెప్పవచ్చు.
ఇక రాజమౌళి సినిమాల ప్లానింగ్ లు ఎంత గ్రాండ్ గా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇలానే మహేష్ బాబుతో భారీ స్థాయి చిత్రాన్ని ప్రపంచ ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నట్టుగా ఈ సినిమాపై కూడా పలు రూమర్స్ ఉన్నాయి. కాగా ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ ఎన్నో ఏళ్ళు కితం రాజమౌళి అనుకోని ఆపేసిన బిగ్ ప్రాజెక్ట్ "గరుడ" అంటూ కూడా రూమర్స్ ఉన్నాయి.కాగా ఇలా ప్రతీ చిన్న అంశం కూడా ఈ సినిమాపై భారీ ఎలిమెంట్ గా మారుతూ వస్తుంది. అయితే ఇండియన్ సినిమా దగ్గర చాలా చిత్రాలు అత్యధిక బడ్జెట్ లో తెరకెక్కాయి కానీ ఏ సినిమా కూడా 1000 కోట్ల బడ్జెట్ మార్క్ ని అందుకోలేదు. కానీ ఆ మార్క్ ని అందుకోబోతున్న మొట్ట మొదటి తెలుగు సినిమా అలాగే భారతీయ సినిమా కూడా ఇదే అంటూ టాక్ ఉంది. కాగా ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కే ఎల్ నారాయణ భారీ బడ్జెట్ ని కేటాయించి పెడుతున్నారని టాక్.ఇదిలావుండగా మహేష్ బాబు సినిమా కోసం వంద కోట్లు ఖర్చు పెట్టి వంద ఎకరాల్లో ప్లాస్టిక్ అడవినే క్రియేట్ చేయబోతున్నాడు రాజమౌళి. వంద కోట్ల బడ్జెట్‌ని కేవలం మహేష్ బాబు సినిమాలో ఒక 20 నిమిషాల ఎపిసోడ్ కోసమే వాడబోతున్నాడు. అది కూడా కేవలం ఓ యాక్షన్ ఎపిసోడ్ కోసం వేసే సెట్ అని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఈ సినిమాలో విలన్ ఎవరనే చర్చ జరుగుతోంది. హాలీవుడ్ సూపర్ హీరో థోర్ ఫేం ని మహేష్ బాబు సినిమాలో తీసుకుంటున్నాడు రాజమౌళి. దీని కోసం భారీ సెట్ క్రియేట్ చేస్తున్నారని సమాచారం.మరి చూడాలి ఈ సెన్సేషనల్ కలయిక ఏమవుతుంది అనేది.