డైరెక్టర్ శంకర్.. మణిరరత్నం తర్వాత తెలుగు వాళ్లకు తమిళ సినిమాపై ఆసక్తి కలిగించిన దర్శకుడు. తమిళ సినిమాని కమర్షియల్ గా పైకి లేపిన డైరెక్టర్. ఎంతోమంది 80s, 90s కిడ్స్ కి స్టార్ డైరెక్టర్. స్టార్ డైరెక్టర్ గా ఇప్పుడు రాజమౌళి అందుకుంటున్న జేజేలు శంకర్ తన సినిమాలతో ఎప్పుడో అందుకున్నాడు. కానీ ఇదంతా గతం. తాజాగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు 2 సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకోవడంతో శంకర్ మరోసారి చర్చగా మారారు.1993లో జెంటిల్ మెన్ సినిమాతో దర్శకుడిగా మారిన శంకర్ మొదటి సినిమాతోనే భారీ హిట్ కొట్టాడు. ఆ తర్వాత ప్రేమికుడు, భారతీయుడు, జీన్స్, ఒకేఒక్కడు, బాయ్స్, అపరిచితుడు, శివాజీ, రోబో.. ఇలా ఒకదానికి మించి ఒకటి పెద్ద హిట్ అయ్యాయి. ఇవన్నీ కమర్షియల్ గా భారీ సక్సెస్ అయ్యాయి. ఇవన్నీ తమిళ్ సినిమాలే అయినా తెలుగులో కూడా రిలీజయి, ఇక్కడ కూడా పెద్ద హిట్ అయి తమిళ్ హీరోలని, శంకర్ ని, ఏఆర్ రహమాన్ ని తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేసాయి.శంకర్ సినిమాల్లో ఒక మెసేజ్ ఉంటుంది. శంకర్ సినిమాల్లో ఎమోషన్ కరెక్ట్ గా పండి ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. శంకర్ సినిమాల్లో గ్రాండ్ విజువల్స్ ఉంటాయి, భారీ ఖర్చుతో కూడిన అద్భుతమైన పాటలు ఉంటాయి. వీటన్నిటికీ మించి సాధారణ ప్రజల తాలూకు ఆలోచనలు ఆయన సినిమాల్లో ఉంటాయి.
ఇదిలావుండగా సూపర్ స్టార్ మహేష్ బాబు కొన్ని డిజాస్టర్స్ తరువాత ఎక్కువగా ప్రయోగాలు చేయవద్దని చాలా దృడంగా నిశ్చయించుకున్నాడు. వీలైనంత వరకు సేఫ్ జోన్ లోనే కమర్షియల్ సినిమాలు చేసుకుంటూ మినిమామ్ హిట్స్ అందుకుంటున్నారు. అయితే మహేష్ ఎక్కువగా స్టార్ డైరెక్టర్స్ తోనే వర్క్ చేయడానికి ఇష్టపడతారు. కానీ గతంలో ఒక ఇండియన్ టాప్ డైరెక్టర్ ఆఫర్ చేస్తే చేయనని చెప్పేశాడట.ఇండియన్ టాప్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న శంకర్ మహేష్ తో రెండు మూడు సార్లు ఒక సినిమా చేయాలని సంప్రదింపులు జరిపాడు. ఆ సినిమా మరేదో కాదు. బాలీవుడ్ త్రీ ఇడియట్స్ రీమేక్ స్నేహితుడు. విజయ్ చేసిన మెయిన్ పాత్రలో ముందు మహేష్ బాబుని అనుకున్నారు. కానీ మహేష్ చేయనని చెప్పేశాడు.మహేష్ ఆ సినిమా చేయకపోవడానికి కారణం.. అది రీమేక్ సినిమా అని. మహేష్ తన కెరీర్ లో రీమేక్ సినిమా అస్సలు చేయకూడదని నిర్ణయించుకున్నాడు. ఇదివరకే ఒక భాషలో తెరకెక్కిన సినిమాల కథలను మళ్ళీ తెరకెక్కిస్తే ఆ కిక్కు ఉండదని మహేష్ స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడు. మొత్తానికి శంకర్ లాంటి దర్శకుడు ఫామ్ లో ఉండగా ఆయన కథను రిజెక్ట్ చేసిన మహేష్ మళ్ళీ వేరే కథ తీసుకురండి తప్పకుండా చేస్తానని సింపుల్ ఆన్సర్ ఇచ్చాడట.ఇక శంకర్ ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.