రామ్ చరణ్ మరో రికార్డ్.. దేశంలోనే అతిపెద్ద కటౌట్.. ఎక్కడో తెలుసా?
ఇక రిలీజ్ కంటే ముందే రామ్ చరణ్ అనేక రికార్డులు బద్దలు కొట్టే దిశగా దూసుకుపోతున్నట్టు కనబడుతోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అమెరికా వెళ్లారు రామ్ చరణ్, సినిమా నిర్మాత దిల్ రాజు. ఇక అసలు విషయంలోకి వెళితే.. తాజాగా రామ్ చరణ్ కటౌట్ ఒకటి ఇక్కడ సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. అవును, విజయవాడలో రామ్ చరణ్ అతిపెద్ద కటౌట్ ఒకటి లాంచ్ చేస్తున్నారు. బృందావన్ కాలనీలో ఉన్న వజ్రా గ్రౌండ్స్ లో 250 అడుగుల భారీ గేమ్ చేంజర్ రామ్ చరణ్ కటౌట్ ఒకటి చిత్ర యూనిట్ లాంచ్ చేయబోతున్నారు. కాగా ఇది ఇండియాలోనే లార్జెస్ట్ కటౌట్ అని విశ్లేషకులు అంటున్నారు.
అయితే ఇప్పటివరకు 230 ఫీట్లతో మాత్రమే ఓ కటౌట్ రికార్డు ఉండేదట. ఇపుడు దాన్ని మరో 20 అడుగులు ఎక్కువతో రాంచరణ్ కటౌట్ బ్రేక్ చేసింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఎస్.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’ సినిమాపై ఎటువంటి అంచనాలు నెలకొన్నాయో చెప్పాల్సిన పనిలేదు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్రమైజ్డ్‌గా నిర్మించడం జరిగింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ మూవీ జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది.