బన్నీ కోసం మెగాస్టార్ సంచలన నిర్ణయం.. ఈసారి సంక్రాంతికి వెరైటీగా ఏం చేస్తున్నారంటే..!?

Thota Jaya Madhuri
మనకు తెలిసిందే.. ప్రతి సంవత్సరం కూడా చిరంజీవి సంక్రాంతి సెలబ్రేషన్స్ చాలా చాలా గ్రాండ్గా జరుపుకుంటూ ఉంటారు . కేవలం ఆయన ఒక్కడే కాదు .. ఆయన కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఒకే చోట ఉండాలి అంటూ ముందుగానే ప్లాన్ చేసి ఆ టయానికి ఎవ్వరూ కూడా సినిమా షూట్స్ పెట్టుకోకండి అంటూ కాల్ షీట్స్ ఖాళీగా పెట్టుకోండి అంటూ ముందే ఒక టైం టేబుల్ ఇచ్చేస్తారట. పోయినసారి కూడా సంక్రాంతి సెలబ్రేషన్స్ చాలా చాలా గ్రాండ్ గా జరుపుకున్నారు . దానికి సంబంధించిన పిక్స్ కూడా బాగా ట్రెండ్ అవుతూ వైరల్ అయ్యాయి. ఆ వైబ్స్ చాలా బాగుంటాయి అంటూ కూడా మెగా ఫాన్స్ మాట్లాడుతూ ఉంటారు .


అయితే త్వరలోనే సంక్రాంతి పండుగ రాబోతుంది. ఈసారి సంక్రాంతి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు మెగా ఫ్యామిలీ అని క్యూరియాసిటీ అందరికీ ఉంది . మరీ ముఖ్యంగా రామ్ చరణ్ నటించిన "గేమ్ చేంజర్".. సినిమా అప్ప్టికే రిలీజ్ అయిపోయి ఉంటుంది . అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన "విశ్వంభర" సినిమా రిలీజ్ అవుతుంది . కచ్చితంగా బ్యాక్ టు బ్యాక్ మెగా ఫ్యాన్స్ కి మంచి గూస్ బంప్స్ ఇచ్చే పాజిటివ్ కామెంట్స్ వస్తాయి . అయితే మెగా ఫ్యామిలీ అంతా కూడా ఈసారి కూడా సంక్రాంతి సెలబ్రేషన్స్ లో పాల్గొనాలి అంటూ డిసైడ్ అయ్యిందట .


కానీ మెగాస్టార్ చిరంజీవి బెంగళూరులో సంక్రాంతి సంబరాలు సెలబ్రేట్ చేయడానికి ప్లాన్ చేస్తే అల్లు అర్జున్ బెయిల్ మీద ఉన్న కారణంగా ఎక్కడికి వెళ్లలేడు అని .. సిటీ దాటి బయటకు వస్తే పోలీసులు లీగల్ యాక్షన్ తీసుకుంటారు అని ఈసారి హైదరాబాద్లో ఉండే చిరంజీవి ఇంట్లోనే ఏర్పాట్లు చేయాలని డిసైడ్ అయ్యారట . దీంతో మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ ల మధ్య  జరుగుతున్న వార్ కి ఫుల్ స్టాప్ పెట్టిన్నట్లు అవుతుంది అంటున్నారు జనాలు. మరొక పక్క పవన్ కళ్యాణ్ కూడా ఈసారి సంక్రాంతి సెలబ్రేషన్స్ లో పాల్గొనడానికి ముందుగానే ప్లాన్ చేసుకున్నారు అంటూ కూడా తెలుస్తుంది . బహుశా ఇక్కడైనా పవన్ కళ్యాణ్ - అల్లు అర్జున్ కలుస్తారేమో చూడాలి..!?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: