అందాలను ఆరబోసింది.. హిట్లు కొట్టింది.. ఇప్పుడేమో టాలీవుడ్‌కి దూరం..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటి మనులలో రాశి ఖన్నా ఒకరు. ఈ ముద్దు గుమ్మ ఊహలు గుసగుసలాడే అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. అలాగే ఇందులో రాశి ఖన్నా తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దానితో ఈమెకు ఆ తర్వాత తెలుగులో వరుస పెట్టి అవకాశాలు దక్కాయి. ఇకపోతే ఆ తర్వాత ఈమె నటించిన సినిమాలలో చాలా సినిమాలు మంచి విజయాలను అందుకోవడంతో ఈమె తెలుగులో మంచి స్థాయికి చేరుకుంది.

ఇకపోతే ఈ బ్యూటీ ఎక్కువ శాతం కమర్షియల్ సినిమాలలో నటించి తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న సమయం లోనే ఈ బ్యూటీ తెలుగు సినిమాలలో కంటే కూడా తమిళ్ , హిందీ సినిమాలలో నటించడానికి ఆసక్తిని చూపిస్తుంది. అందులో భాగంగా ఈ మధ్య కాలంలో ఈమె ఎక్కువ శాతం తమిళ్ , హిందీ సినిమాలలోనే నటిస్తూ వస్తుంది. ఈమె తెలుగు సినిమాలలో నటించి చాలా కాలమే అవుతుంది. ప్రస్తుతం కూడా ఈమె చేతిలో పెద్ద స్థాయిలో తెలుగు సినిమాలు ఏమీ లేవు. ఇకపోతే ప్రస్తుతం ఈ బ్యూటీ వరస పెట్టి హిందీ సినిమాలలో నటిస్తూ వస్తుంది.

ఇది ఇలా ఉంటే సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తుంది. ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో చాలా వరకు అదిరిపోయే రేంజ్ లో వైరల్ కూడా అయ్యాయి. ఇలా  రాశి ఖన్నా సినిమాల్లో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా తన అందాలను భారీగా అరబోస్తూ కుర్రకారు ప్రేక్షకులకు హిట్ పెంచుతూ వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: