పవన్.. మహేష్ రిజెక్ట్ చేసిన స్టోరీతో తమిళ నటుడికి బ్లాక్బస్టర్.. సూపర్ ఛాన్స్ వేస్ట్ చేశారు..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , సూపర్ స్టార్ మహేష్ బాబు ముందు వరసలో ఉంటారు. వీరిద్దరూ ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలలో నటించి ఇప్పటికీ కూడా తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో కెరీర్ ను కొనసాగిస్తున్నారు. ఇకపోతే ఈ ఇద్దరు తమ కెరియర్ లో ఎన్నో సినిమాలను రిజెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అందులో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను కూడా అందుకున్నాయి. ఇకపోతే ఈ ఇద్దరు హీరోల దగ్గరికి వచ్చిన ఓ కథను వీరిద్దరూ రిజెక్ట్ చేయగా ఓ తమిళ హీరో మాత్రం ఆ కథలో హీరో గా నటించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడట. ఆ సినిమా ఏది అనే వివరాలను తెలుసుకుందాం.

కొన్ని సంవత్సరాల క్రితం సూర్య హీరో గా ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో గజినీ అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కథను మొదటగా మొరగదాస్ , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వినిపించాడట. కథ మొత్తం విన్న పవన్ కొన్ని కారణాల వల్ల ఈ సినిమాను రిజెక్ట్ చేశాడట. దానితో మురుగదాస్ ఈ మూవీ కథను మహేష్ బాబు కు వినిపించాడట. ఆయన కూడా ఈ కథ మొత్తం విని కొన్ని కారణాలతో రిజక్ట్ చేశాడట. ఇక ఆ తర్వాత తమిళ నటుడు అయినటువంటి సూర్య కు మురుగదాస్ ఆ కథను వినిపించాడట. ఇక సూర్య కు మాత్రం ఈ కథ అద్భుతంగా నచ్చడంతో వెంటనే మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అలా గజిని అనే టైటిల్ తో రూపొందిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక పవన్ మహేష్ రిజెక్ట్ చేసిన కథతో సూర్య కు అద్భుతమైన బ్లాక్ బస్టర్ విజయం అందినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: