ఆర్జీవీకి దెబ్బ మీద దెబ్బ.. మొన్న అలా ఇప్పుడు ఇలా!
అయితే ఈ సినిమాకు కేవలం 1863 వ్యూస్ మాత్రమే ఉన్నాయని ఒక్కో వ్యూకు రూ. 11 వేలు చొప్పున చెల్లించారని తెలిపింది. వ్యూహం సినిమాకు వ్యూస్ లేకున్నా ఫైబర్ నెట్ నుంచి కోటీ 15 లక్షల వరకూ అనుచిత లబ్ధి పొందారని ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఫైర్ అయ్యింది. దీనిపై వివరణ కోరుతూ వ్యూహం సినిమాకు లీగల్ నోటీస్ ఇచ్చినట్లు తెలిపింది.
ఈ విషయంపై ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఛైర్మన్ జీవీ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఆయన ఆ సమావేశంలో మాట్లాడుతూ.. ఏపీ ఫైబర్‌నెట్ ద్వారా వ్యూహం సినిమా చూసినందుకు వారికి ఒక్కో వ్యూకు రూ.11 వేలు మాత్రమే చెల్లించారని మండిపడ్డారు. మొత్తం రూ. 2.10 కోట్లు ఫైబర్‌నెట్ బ్యాంకు అకౌంట్ నుంచి రామ్ గోపాల్ వర్మ ఆర్వీ సంస్థ బ్యాంకు ఖాతాలోకి వెళ్లాయని ఆరోపించారు. ఏపీ ఫైబర్‌నెట్ ఛానల్‌లో వ్యూహం సినిమాను కేవలం 1,863 మంది మాత్రమే చూశారని.. ఒప్పందం ప్రకారం ఒక్కో వ్యూకు రూ.100ల చొప్పున చెల్లించాల్సి ఉందన్నారు. కానీ ఏకంగా 11 వేల చొప్పున చెల్లించినట్లు తెలిపారు. ఆర్జీవీ ఆర్వీ సంస్థకు రూ.2 లక్షలు రావాల్సి ఉంటే.. రూ.2 కోట్లకుపైగా చెల్లించారని చెప్పుకొచ్చారు. ఏపీ ఫైబర్ నెట్‌లో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరుపుతామని స్పష్టం చేశారు.