మూడో ప్రెగ్నెన్సీ పై.. అనసూయ హాట్ కామెంట్స్..!
అయితే తనకి ఇప్పటికే ఇద్దరు మగ పిల్లలు ఉన్నారని.. తనకు మూడో బిడ్డ కనలని ఉందని కూడా తెలిపింది. అది కేవలం ఆడపిల్లకు జన్మనివ్వాలని తన మనసులో మాటను సైతం తెలియజేసింది అనసూయ. అయితే ఈ విషయంలో మాత్రం తన భర్త కోపరేట్ చేయడం లేదంటూ అనసూయ నవ్వుతూ తెలియజేసింది. అలాగే తనకు ఎందుకు ఆడబిడ్డ కావాలనే విషయం పైన తెలియజేస్తూ.. ఇల్లు చక్కగా ఉండాలి అంటే ఆడపిల్ల కచ్చితంగా ఉండాల్సిందే అంటూ తెలియజేసింది అనసూయ. అంతేకాకుండా ఆడపిల్లలు ఉంటే అప్పుడే అబ్బాయిలకు ఎలా ఉండాలో అనే విషయం కూడా తెలుస్తుందని తన అభిప్రాయంగా తెలియజేసింది అనసూయ. తన తండ్రికి కూడా ఎక్కువగా ఆడపిల్లలంటే ఇష్టమని తెలిపింది.
జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న అనసూయ రంగస్థలం సినిమాతో స్టార్డమ్ ని అందుకున్నది.ఆ తర్వాత ఎంతోమంది స్టార్ హీరోల చిత్రాలలో కీలకమైన పాత్రలలో నటించింది కొన్ని చిత్రాలలో విలన్ గా కూడా నటించి మెప్పించింది అనసూయ. అనసూయ ఎలాంటి పాత్రలోనైనా సరే చేయడానికి సిద్ధంగానే ఉంటుంది. సినిమాలలో నటించడానికి బుల్లితెరకు కూడా దూరమైంది అనసూయ. నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన కుటుంబానికి సంబంధించిన విషయాలను కూడా వెల్లడిస్తూ ఉంటుంది.