సోనియాకు హ్యాండ్ ఇచ్చిన పెద్దోడు... అంత నమ్మితే చివరకు ఇలా!
అయితే సోనియా బిగ్ బాస్ సీజన్ 8 సీజన్ లో నిఖిల్, పృధ్విలతో బాగా క్లోజ్ అయ్యింది. ఆమె ఏం చెబితే అది చేసేలా వాళ్లిద్దరిని మార్చేసింది. వాళ్లిద్దరితో క్లోజ్ గా ఉంటూ లవ్ స్టోరీ నడిపిస్తుంది అనే సారికి.. సడెన్ గా పెద్దోడు చిన్నోడు అంటూ మాట మార్చేసింది. అంతేకాదు తర్వాత తాను యష్ అనే అతనితో లవ్ లో విషయం కూడా చెప్పింది. బయటకు వెళ్లాక పెళ్లి చేసుకుంటానని కూడా తెలిపింది. కానీ సోనియా నిఖిల్, పృధ్విని తనకి నచ్చినట్లు ఆడుస్తుందని టాక్ వచ్చింది. ఆ నెగిటివిటీ వల్లే సోనియా ఎలిమినేట్ అయ్యింది.
ఐతే బిగ్ బాస్ ఉన్నప్పుడు ఒక్క పుట కూడా నిఖిల్ ని వదలకుండా.. అంటిపెట్టుకుని ఉన్న సోనియా, బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్లి వచ్చాక మళ్లీ హౌస్ లో నామినేషన్స్ కోసం వెళ్లి నిఖిల్ ని నామినేట్ చేసింది. ఆ టైం లో సోనియా నిఖిల్ ని చాలా మాటలు అని వెళ్ళిపోయింది. ఆ తర్వాత సోనియా యష్ తో ఎంగేజ్మెంట్ జరుపుకుంది. ఇటీవల వీరి వివాహం కూడా జరిగింది. అయితే సోనియా పెళ్లికి
బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తేజ, రోహిణి, ప్రేరణ, బెబక్క అందరూ వచ్చారు. వారితో పాటు అమర్ దీప్, తేజశ్విని కూడా వచ్చారు. కానీ.. పెద్దోడు నిఖిల్ మాత్రం కనిపించలేదు. దీంతో పెద్దోడు, సోనియా మ్యారేజ్ కు అటెండ్ అవ్వకపోవడానికి రీజన్స్ ఏంటో అని ఆడియన్స్ అనుకుంటున్నారు. సోనియా మాత్రం తన ప్రేమికుడు యష్ ని పెళ్లాడి కొత్త జీవితాన్ని మొదలు పెట్టింది.