శ్రీ తేజ్ కి మంత్రి ఆర్దిక సహాయం
పుష్ప 2 సినిమా రిలీజ్ రోజు జరిగిన తొక్కిసలాటలో శ్రీ తేజ్ కి ఆక్సిజన్ అందక బ్రెయిన్ డ్యామేజ్ జరిగిందని డాక్టర్స్ తెలిపిన విషయం తెలిసిందే. అయితే బాలుడు శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై మంత్రి కోమటిరెడ్డి ఆరా తీశారు. అనంతరం ఆయన వ్యక్తిగతంగా ప్రతిక్ ఫౌండేషన్ నుంచి రూ. 25 లక్షల ఆర్థిక సాయం అందించారు. శ్రీ తేజ్ త్వరగా కొలుకోవాలని ఆ దేవుడిని ప్రదిస్తున్నట్లు తెలిపారు. బాలుడు ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వస్తాడని శ్రీ తేజ్ తండ్రికి దైర్యం చెప్పారు. రేవతి మరణానికి ఎంతగానో చింతిస్తున్నట్లు మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి చెప్పారు.
అయితే తాజాగా శ్రీతేజ్ హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. శ్రీతేజ్ క్రమంగా కోలుకుంటున్నాడని తెలిపారు. వెంటిలేటర్ సాయం లేకుండా ఆక్సిజన్ తీసుకుంటున్నాడని చెప్పుకొచ్చారు. శ్రీతేజ్ ఫీడింగ్ సక్రమంగా తీసుకుంటున్నాడని.. న్యూరాలజీ కండీషన్ స్థిరంగా ఉందని డాక్టర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. ఇక ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్‌పై బీఎన్ఎస్ 105, 118 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఐకన్ స్టార్ అల్లు అర్జున్ థియేటర్‌కు వచ్చిన సమయంలో భద్రతాపరంగా జాగ్రత్తలు తీసుకోనందుకు థియేటర్ యాజమాన్యంపై కూడా కేసు నమోదైంది. ఇక ఇటీవల ఈ ఘటనపై అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి కూడా స్పందించిన విషయం తెలిసిందే.