ఆ కామెంట్లు వింటే చాలా బాధేస్తుందన్న బన్నీ.. ఆ వార్తలు నిజం కాదంటూ?
నేను చెబితే మాత్రమే అభిమానులు వింటారని కాబట్టి చెప్పానని బన్నీ వెల్లడించారు. థియేటర్ కు వెళ్లిన తర్వాత సినిమా చూస్తున్న సమయంలో నన్ను పోలీసులు ఎవరూ కలవలేదని ఆయన తెలిపారు. బయట ఓవర్ క్రౌడ్ అవుతుందని నా మేనేజ్మెంట్ చెబితే నేను వెళ్లిపోయానని బన్నీ పేర్కొన్నారు. నన్ను పోలీసులు ఎవరూ కలవలేదని ఆయన వెల్లడించారు.
రేవతి మృతి గురించి, శ్రీతేజ్ గురించి నెక్స్ట్ డే నాకు తెలిసిందని బన్నీ పేర్కొన్నారు. నాకు తెలిసి కూడా సినిమాను చూస్తున్నానని ప్రచారం చేయడం ఘోరం అని బన్నీ వెల్లడించారు. రేవతి మరణవార్త నన్ను బాధ పెట్టిందని ఆయన పేర్కొన్నారు. బన్నీవాస్ ను నేను వెంటనే పంపించానని తాను ఆస్పత్రికి వెళ్తే సమస్య వస్తే కష్టమని బన్నీవాస్ సూచించారని ఆయన వెల్లడించారు.
నాపై వాళ్లు కేస్ ఫైల్ చేయడంతో నేను వాళ్లను కలవలేదని బన్నీ కామెంట్లు చేశారు. నేను ఎవరో తెలియని వాళ్లను కలవడానికి వెర్వేరు ప్రాంతాలకు వెళ్లానని నా ఫ్యాన్స్ ను నేను కలవనా అని బన్నీ వెల్లడించారు. నేను కూడా షాక్ లో ఉన్నానని ఆయన పేర్కొన్నారు. మరుసటి రోజు నేను ఒక వీడియో పెట్టానని బన్నీ వెల్లడించారు. ఈ ఘటన తర్వాత పుష్ప2 సెలబ్రేషన్స్ సైతం క్యాన్సల్ చేశామని బన్నీ అన్నారు. బన్నీ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.