ప్రెస్ మీట్లో సంచలన నిజాలు చెప్పిన అల్లు అర్జున్..!
ముఖ్యంగా తాను పర్మిషన్ లేకుండా థియేటర్ కి వెళ్లలేదని బాధ్యత లేకుండా తాను ఎక్కడ ప్రవర్తించలేదని ఈ మాటలు విన్నప్పుడు తనకు చాలా బాధ కలుగుతుందని ఈ విషయాలు తనని ఎన్నోసార్లు బాధపెట్టాయని తెలియజేశారు. అలాగే శ్రీ తేజ్ ఆరోగ్యం కూడా ఎలా ఉందని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉంటానని తెలిపారు. 20 ఏళ్లుగా నన్ను మీరు చూస్తూనే ఉన్నారు కదా నేను ఎప్పుడైనా ఇలా మాట్లాడానా? అంటూ తెలిపారు అల్లు అర్జున్. అలాగే తాను ఎక్కడ కూడా రోడ్డు షో చేయలేదని థియేటర్ ముందు కారు అలా వెళుతూ ఆగింది.. జనం ఎక్కువగా ఉండడంతో ఒక్కసారిగా చేయి ఊపాను అంతే అంటూ తెలిపారు అల్లు అర్జున్.
సినిమాకు వచ్చిన వారిని తాను ఎంటర్టైన్మెంట్ చేయాలనుకుంటానని మూడేళ్ల పాటు పడిన కష్టం దేశం మొత్తం మెచ్చుకొనేలా సినిమా చేశాను థియేటర్ ఒక దేవాలయం లాంటిది.. థియేటర్ కి వచ్చే వారిని నవ్వుతూ పంపించాలనే అనుకుంటానని కానీ తన పైన చేసిన ఈ ఆరోపణలు తనని చాలా బాధ కలిగిస్తున్నాయంటూ తెలిపారు అల్లు అర్జున్. తాను ఎప్పుడూ కూడా రోడ్డు షో చేయలేదని 15 రోజులుగా సినిమా ఎంత పెద్ద హిట్ అయినప్పటికీ కూడా తాను ఇంట్లోనే కూర్చొని చాలా బాధపడ్డాను అంటూ తెలియజేశారు అల్లు అర్జున్. మొత్తానికి తన పైన చేసిన వ్యాఖ్యలకు అల్లు అర్జున్ క్లారిటీ ఇవ్వడం జరిగింది.