అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాటల తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం సంచలనంగా మారింది.అయితే ఈ ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి మాటలకు కౌంటర్ ఇస్తారని అందరు అనుకున్నారు. కానీ ప్రత్యక్షంగా ఎలాంటి కౌంటర్ ఇవ్వకపోయినప్పటికీ పరోక్షంగా మాత్రం గట్టి కౌంటర్ ఇచ్చారు. ఎందుకంటే తప్పుడు కమ్యూనికేషన్ వల్ల నాపై చాలామంది చాలా రకాల ఆరోపణలు చేశారు.కానీ వాటిలో ఎలాంటి నిజం లేదు. ఆ ఆరోపణలకు నేనే చాలా బాధపడ్డాను.. అంటూ పరోక్షంగా స్పందించారు. అలాగే రేవంత్ రెడ్డి మాటలపై స్పందించాలని జర్నలిస్టులు అడిగినా కూడా వాటిపై స్పందించడానికి అల్లు అర్జున్ ఇష్టపడలేదు. ఇక అల్లు అర్జున్ మాట్లాడేటప్పుడు జగపతిబాబు,సుకుమార్, సుకుమార్ భార్య, బన్నీ వాసు ఇలా ఎంతోమంది సపోర్ట్ చేశారన్నట్టుగా మాట్లాడారని, కానీ మెగా ఫ్యామిలీ పేరు కూడా ఎత్తలేదు.
అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో మెగా ఫ్యామిలీ ఊసే లేకపోవడంతో చాలామంది మెగా ఫ్యాన్స్ నిరాశ పడ్డారు. ఎందుకంటే అల్లు అర్జున్ బెయిల్ మీద బయటకు రావడంలో మెగా ఫ్యామిలీ హస్తము ఉంది అని ఎన్నో వార్తలు వినిపించాయి. కానీ అల్లు అర్జున్ మాత్రం మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేశారు అని ఒక్క పదం కూడా మాట్లాడకపోవడంతో మెగా ఫ్యాన్స్ హర్ట్ అయిపోయారు.
పుష్ప 2 సినిమాలో నటించిన జగపతిబాబు, సుకుమార్ ఇలా ఎంతోమంది పేర్లు చెప్పినప్పటికీ మెగా ఫ్యామిలీకి సంబంధించి చిరంజీవి గాని పవన్ కళ్యాణ్ గాని ఈ రెండు పేర్లు చెప్పలేదు. దీంతో అందరికీ థాంక్స్ చెప్తూ మెగా ఫ్యామిలీ ఊసే ఎత్తని అల్లు అర్జున్ అంటూ కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే అల్లు అర్జున్ చిరంజీవి పవన్ కళ్యాణ్ ల అభిమానులు చనిపోతే వారి దగ్గరికి వెళ్లి కలిసే నేను నా సొంత అభిమానికి కష్టం వస్తే ముందు నిలబడనా అంటూ చిరంజీవి పవన్ కళ్యాణ్ పేర్లు తీశారు.