నందమూరి నట సింహం బాలకృష్ణ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు . బాలయ్య ఇప్పటి వరకు తన కెరీర్ లో అనేక విజయ వంత మైన సినిమాల్లో హీరో గా నటించాడు . అలాగే ఎన్నో విజయవంతమైన సినిమాలను రిజెక్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి . ఇకపోతే బాలయ్య రిజెక్ట్ చేసిన ఓ మూవీ లో నాగార్జున హీరో గా నటించాడు. ఆ మూవీ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ మూవీ ఏది ..? బాలయ్య ఎందుకు దానిని రిజెక్ట్ చేశాడు అనే వివరాలను తెలుసుకుందాం.
కొన్ని సంవత్సరాల క్రితం నాగార్జున హీరో గా విజయశాంతి హీరోయిన్గా రాఘవేంద్రరావు దర్శకత్వంలో జానకి రాముడు అనే సినిమా వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ మూవీ ని మొదట రాఘవేంద్రరావు , నాగార్జున తో కాకుండా బాలకృష్ణ తో చేయాలి అనుకున్నాడట. అందులో భాగంగా బాలకృష్ణ ను కలిసి ఈ సినిమా కథను కూడా వివరించాడట. కథ మొత్తం విన్న బాలకృష్ణ ఈ సినిమా కథ బాగానే ఉంది. కానీ తనపై అస్సలు వర్కౌట్ కాదు. వేరే హీరోతో సినిమా చేస్తే బాగుంటుంది అని రాఘవేంద్రరావుకు సలహా ఇచ్చాడట.
దానితో రాఘవేంద్రరావు ఈ కథను నాగార్జున కు వినిపించాడట. నాగార్జున కు ఈ సినిమా కథ అద్భుతంగా నచ్చడంతో వెంటనే సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. దానితో జానకి రాముడు అనే టైటిల్ తో ఈ మూవీ ని స్టార్ట్ చేసి , పూర్తి చేశారట. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది. అలా బాలయ్య రిజెక్ట్ చేసిన కథతో నాగార్జున మంచి విజయాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది.