బాబాయ్ షోకు అబ్బాయి రెడీ .. ఇద్దరి మధ్య దూరం కాస్త దగ్గర..!

Amruth kumar
నట సింహం బాలకృష్ణ మొదటి నుంచి యంగ్ టైగ‌ర్‌ ఎన్టీఆర్ ని ఎంకరేజ్  చేస్తూ వచ్చాడు .. కానీ కొన్ని అనుకోని కారణాలు కారణంగా ఆ తర్వాత బాబాయ్‌తో అబ్బాయి మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది. ఆ గ్యాప్ ని వైసిపి నాయకులు వాడుకోవడానికి ప్రయత్నిస్తూ వచ్చారు. అలాంటిది ఇప్పుడు సడన్గా బాలయ్య బాబాయ్ కి ఎన్టీఆర్ దగ్గరవుతున్నాడని చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది. నందమూరి కుటుంబానికి ఎన్టీఆర్‌కు మధ్య ఉన్న దూరం కాస్త ఇప్పుడు దగ్గరవుతుందని తెలుస్తుంది. ఆన్ స్టాపబుల్ షో కి ఎన్టీఆర్ రావడం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిందని అంటున్నారు. చిరంజీవి , ఎన్టీఆర్ రాకమేదే ఇంతకాలం చాలా అనుమానాలు ఉండేవి .. ఇప్పుడు ఆ రెండిటిని కొత్త షోలతో క్లియర్ చేయబోతున్నారు. అయితే ఇప్పుడు ఇంత ఖచ్చితంగా ఈ మాట అనడానికి కారణం ..

 లీకైన క్వశ్చన్ పేపర్ .. ఏ హీరో అయినా షోకి రాబోతున్నారు అంటే ముందు క్వశ్చన్ పేపర్ చేయాల్సి ఉంటుంది .. అదే జరిగింది కాబట్టి ఇలాంటి చర్చ ఇప్పుడు మొదలైంది ? ఎలా అయితే మెగా గ్యాప్ ని దూరం చేసేందుకు అల్లు అర్జున్ చిరంజీవి ఇంటికి వెళ్లాడు .. ఇప్పుడు బాబాయ్‌ షో కి అబ్బాయి వెళ్లబోతున్నాడా ? ఇక అన్ ష్టాపబుల్ షోలో పవన్ తో బాలయ్య ఎపిసోడ్ బాగా పేలింది .. అలాగే ప్రభాస్ తో కూడా అదిరిపోయింది.. ఎన్నో అరుదైన ఇంటర్వ్యూ లతో ఆన్ స్టాపబుల్ ఇండియాలోనే నెంబర్ వన్ షోగా మారింది. ఇప్పుడు చిరంజీవితో బాలయ్య ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు అనుకుంటున్నా టైం లో .. ఈ సీన్లోకి ఎన్టీఆర్ పేరు వచ్చింది. ఇక నిజంగానే న్యూ సీజన్ లో ఈ వింత జరిగేందుకు అవకాశం ఉందట. నందమూరి కుటుంబంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాత ఎన్టీఆర్ తర్వాత ఎక్కువగా ఎంకరేజ్ చేసింది బాలకృష్ణనే..

ఇక తన బాబాయ్‌ని కూడా ఎన్నోసార్లు ఆకాశానికి ఎత్తుతూ జై బాలయ్య అన్నాడు ఎన్టీఆర్.. తన అభిమానాన్ని చాటుకున్నాడు .. అంతవరకు బానే ఉంది కానీ గత ఐదారేళ్లుగా నందమూరి ఫ్యామిలీకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి మధ్య గ్యాప్ పెరిగిందని అభిప్రాయం వచ్చింది. బాబాయ్ తో అబ్బాయికి పెద్దగా మాటలు లేవని.. ఇప్పుడు ఆ పరిస్థితి మారిందని .. గత రెండు నెలలుగా బాబాయ్ కి అబ్బాయికి మధ్య చిన్న పాటి రాయబారాలు నడుస్తున్నాయని చర్చ జరుగుతుంది .. మొన్నటి వరకు ఎన్టీఆర్ కాదు కళ్యాణ్ రామ్ కూడా బాలయ్య బాబాయ్ తో దూరంగా ఉంటూ వస్తున్నారు .. కానీ అన్ ష్టానబుల్ షో కి ఎన్టీఆర్ రాక ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యింది. రామ్ చరణ్ , పవన్ , ప్రభాస్‌లు ఇంతమంది వచ్చిన ఎన్టీఆర్ రాక ఎప్పుడు ఈ షోకు అన్న ప్రశ్న వస్తూనే ఉంది .. ఆ ప్రశ్నకి ఇప్పుడు ఆల్మోస్ట్ ఆన్సర్ దొరికినట్టే ఉంది. ఎందుకంటే ఎన్టీఆర్ షో కోసం ప్రశ్నలు ఇంట్రడక్షన్ సీన్ ఇలా అన్నిటికీ స్క్రిప్ట్ పేపర్ రెడీ అయింది. ఈ పేపర్ లీకేజీ తోనే కచ్చితంగా అన్ స్టాపబుల్ వచ్చే కొత్త సీజన్లో ఎన్టీఆర్ ఎపిసోడ్ ఉంటుందని మాటకు బలం చేకూరుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: